Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంత ఫేమసో.. అతని కూతురు అర్హ అంతకన్నా ఎక్కువ ఫేమస్. అర్హ పుట్టినదగ్గరనుంచి కూడా ఆమె సెలబ్రిటీ అని చెప్పాలి. అల్లు అర్జున్- అల్లు స్నేహారెడ్డి.. అర్హను సెలబ్రిటీగా మార్చేశారు. పుట్టినప్పటినుంచి అర్హ ఫోటోలు, వీడియోలు.. బన్నీతో చేసిన అల్లరి పనులు అన్నింటిని అభిమానులకు షేర్ చేసేది అల్లు స్నేహ. దీంతో అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీగా మారిపోయింది. అంతేనా కేవలం నాలుగేళ్లకే అంజలి.. అంజలి అనే సాంగ్ ను రీక్రియేట్ చేస్తే అందులో చిన్నారి అంజలి గా అర్హ నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పాలి. ఇక ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో భరతుడుగా నటించి బన్నీ కూతురా.. ? మజాకానా ..? అని అనిపించింది. నిత్యం అర్హ తన ముద్దు ముద్దు మాటలతో సోషల్ మీడియాలో అటెన్షన్ గ్రాబ్ చేస్తూనే ఉంటుంది. పెద్దవాడు అయాన్ సైలెంట్ అయినా అర్హ మాత్రం చాలా అల్లరి పిల్ల అని అల్లు అరవింద్ తో పాటు అల్లు కుటుంబం మొత్తం చెప్పుకొచ్చారు.
Kushi: విజయ్ దేవరకొండకి పోటీగా రంగంలోకి రష్మిక మాజీ ప్రియుడు..
ఇక ఆ అల్లరికి చెక్ పడింది. అర్హకు స్కూల్ కు వెళ్లే టైమ్ వచ్చింది. ఈరోజు అర్హ పాప.. మొదటిసారి స్కూల్ కు వెళ్తోంది అని స్నేహ తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అన్న అయాన్ చేతిని పట్టుకొని చక్కగా బ్యాగ్ తగిలించుకొని అర్హ స్కూల్ కు వెళ్తూ కనిపించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ .. బాగా చదవాలి అర్హ అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఏ చిన్నారి అయినా మొదటి రోజు స్కూల్ కు వెళ్ళినప్పుడు ఏడుస్తూ ఉంటారు. కాన, అర్హ మాత్రం చక్కగా స్కూల్ కు వెళ్లడం చూసి చాలామంది ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ చిన్నది రేపు పెద్దది అయ్యాక హీరోయిన్ గా సెటిల్ అవుతుందో.. లేక చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేస్తుందో చూడాలి.