Rakshit Shetty Sapta Sagaradaache Yello Vs vijay devarakonda Kushi: విజయ్ దేవరకొండ సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటో తేదీన విడుదల అయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ ప్రారంభించిన సినిమా యూనిట్ ట్రైలర్ను ఈరోజు హైదరాబాద్ లో ఒక భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేసింది. కేవలం తెలుగు మీడియాను మాత్రమే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల మీడియా ప్రతినిధులను కూడా పిలిచి గ్రాండ్ పార్టీ ఇవ్వడమే కాదు ట్రైలర్ లాంచ్ కూడా నిర్వహించారు. అయితే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త తెరమీదకు వచ్చింది. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన మధ్య ఉన్న రిలేషన్ గురించి రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు తెరమీదకు వస్తూనే ఉంటాయి.
Mahesh Babu: హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు
వీరిద్దరూ కలిసి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలకు పని చేశారు. గీత గోవిందం సినిమా తర్వాత అప్పటికే ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్న రక్షిత్ శెట్టితో రష్మిక మందన బ్రేకప్ చెప్పి ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకుంది. దీనికి కారణం విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడటమే అనే ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఆ తర్వాత కూడా పలు సందర్భాలలో వీరు కలిసి కనిపించడం కలిసి వెకేషన్ కు కూడా వెళ్లారనే ప్రచారం జరగడంతో వీరిద్దరి ప్రేమ గురించి అనేక చర్చలు జరిగాయి. ఆ ప్రచారాలను వీరు ఎప్పుడూ గట్టిగా ఖండించింది లేదు, అయితే తాము స్నేహితులమని ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చారు.
అయితే ఇప్పుడు ఆసక్తికరంగా రక్షిత్ శెట్టి హీరోగా నటించిన కన్నడ సప్త సాగర దాచే ఎల్లో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్, అచ్యుత్ కుమార్, అవినాష్ వంటి కన్నడ నటులు కూడా నటిస్తున్నారు. రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా రిలీజ్ అవుతున్న సెప్టెంబర్ ఒకటవ తేదీనే రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి విజయ్ దేవరకొండ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఒక రకంగా పాన్ ఇండియా మూవీ అని చెప్పవచ్చు. అయితే కన్నడలో విజయ్ దేవరకొండ సినిమాకి పోటీగా ఇప్పుడు రక్షిత్ శెట్టి నటించిన ఈ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.