Rashmika : నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, హీరో దీక్షిత్ శెట్టి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నవంబర్ 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో అరవింద్ మాట్లాడుతూ ఈ కథను రాహుల్ నాలుగేళ్ల క్రితం చెప్పాడు. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ హెవీ పర్ ఫార్మెన్స్ ఉంటుంది. అందుకే రష్మికను ఎంపిక చేసుకున్నాం.
Read Also : Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్
తను నాకు కూతురు లాంటిది. రష్మికకు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ వస్తాయి. ఈ సినిమా చూశాకే దీక్షిత్ ఎంత మంచి పర్ ఫార్మర్ అనేది ఆడియెన్స్ తెలుసుకుంటారు. రశ్మిక, దీక్షిత్ తో ఒక ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్ తీసుకున్నాడు రాహుల్. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండను గెస్ట్ గా తీసుకొద్దాం అంటూ తెలిపాడు అల్లు అరవింద్. డైరెక్టర్ రాహుల్ మాట్లాడుతూ ఈ సినిమాకు అరవింద్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా చూశాక అందరూ ఒక ఎమోషన్ తో బయటకు వస్తారని తెలిపాడు. హీరోయిన్ రశ్మిక మందన్న మాట్లాడుతూ భూమా అనే పాత్రలో నటించాను. మంచి కథను ఆడియెన్స్ కు చెప్పాలనే ఈ సినిమా చేశాను. నా కెరీర్ లో రైట్ టైమ్ లో కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇది. అందరికీ నచ్చతుంది అంటూ తెలిపింది రష్మిక.
Read Also : Bigg Boss 9 : అయ్యో.. పచ్చళ్ల పాప ఎలిమినేట్..?