Allari Naresh : అల్లరి నరేశ్ ఈ నడుమ సీరియస్ కథలతోనే సినిమాలు చేస్తున్నాడు. చాలా వరకు ప్లాపులే వస్తున్నా ప్రయత్నం మాత్రం ఆపట్లేదు. ఇక తాజాగా ఆయన కొత్త మూవీ టైటిల్ టీజర్ ను రివీల్ చేశారు. నరేశ్ హీరోగా నాని కాసరగడ్డ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక తాజాగా మూవీ టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో మూవీ టైటిల్ ను “12 ఎ రైల్వే కాలనీ’ అంటూ ప్రకటించారు. అంతే కాకుండా ఈ టీజర్ ను కూడా వణుకు పుట్టించేలా డిజైన్ చేశారు. మరోసారి నరేశ్ హర్రర్ మూవీతోనే రాబోతున్నాడనిపిస్తోంది.
Read Also : Priyadarshi : ‘సారంగపాణి జాతకం’ చెప్పేది ఎప్పుడంటే?
ఈ టీజర్ లో “ఆత్మలు కొందరికే ఎందుకు కనిపిస్తాయిరా” అనే డైలాగ్ లో మొదలు పెట్టారు. “ప్రాణాలతో బయటకు పోవుడు అవసరం లేదు” అంటూ ఎండ్ చేశారు. నరేశ్ చెప్పిన రెండో డైలాగ్ ను బట్టి చూస్తుంటే ఇది మరింత భయపెట్టేలా తీస్తున్నారని అర్థం అవుతోంది. పొలిమేర-1, పొలిమేర-2 రైటర్ అనిల్ విశ్వనాథ్ ఈ షోకు రన్నర్ గా వ్యవహరిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. సాయికుమార్, వైవా హర్ష, సద్దాం, జీవన్ లాంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. టీజర్ చూస్తుంటే ఇది వణుకు పుట్టించే హర్రర్ కమ్ మిస్టరీ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. దెయ్యాలు, చేతబడి నేపథ్యంలోనే తీస్తున్నారని అర్థం అవుతోంది. మరి ఈ సినిమాతో నరేశ్ హిట్ కొడుతాడా లేదా అన్నది చూడాలి.