ప్రభాస్ నటించబోయే సినిమాలలో సందీప్ రెడ్డి వంగాతో చేయబోయే స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం కొత్త నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. మరోవైపు ప్రభాస్ ఫౌజీ. రాజసాబ్ షూటింగ్స్ పూర్తి చేసేలా జెట్ స్పీడ్‌లో ఉన్నాడు. వీలైనంత త్వరగా స్పిరిట్‌ను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు వంగా .ఈ సినిమాలో ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు ప్రభాస్.
Also Read : Rapo 22 : రామ్ రైటింగ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్.
కానీ ఇప్పుడు ఈ సినిమాపై రకరకలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ ముందుగా రాజాసాబ్, ఫౌజీ సినిమాలను ఫినిష్ చేసి ఆ తర్వాత ప్రశాంత్ వర్మ సినిమా స్టార్ట్ చేస్తాడని ఆ వెంటనే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 చేసి లైన్ లోనే సలార్ 2 ను కూడా చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. ఇవన్నీ ఫినిష్ అయ్యాకే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే ఇవన్నీ ఫేక్ అని విశ్వసనీయ సమాచారం. సందీప్ రెడ్డి వంగా మరే ఇతర సినిమాలు చెయట్లేదు. ఇటీవల ఆయన కథ చెప్పడానికి రెండుసార్లు చెన్నైకి వెళ్లి విజయ్ సేతుపతితో చర్చించారు. ప్రస్తుతం సేతుపతి గ్రీన్ సిగ్నల్ కోసం సందీప్ ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్ చాలా కాలం క్రితం ప్రారంభమయ్యాయి. మరోవైపు లొకేషన్స్ వేటకూడా కొనసాగిస్తున్నాడు సందీప్. అందులో భాగాంగానే 4 స్థానాలను ఖరారు చేశారని కూడా తెలిపారు.