బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుదల కాకముందే అమ్మడు టాలీవుడ్ మీద ఫుల్ ఆసక్తి చూపిస్తోంది, ఎన్టీఆర్ 30 లో అవకాశం వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఇక తాజగా ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో స్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక స్టార్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి విడుదలకు సిద్దమవుతుంది.
ఇక ఈ నేపథ్యంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆమె మనుసులోని మాటను చెప్పుకొచ్చింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఎవరు అంటే ఇష్టమని యాంకర్ ప్రశ్నించగా.. కొద్దిసేపు ఆలోచించిన అలియా సమంత పేరు చెప్పుకొచ్చింది. సామ్ ఒప్పుకుంటే ఆమెతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమని, ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ నటనకు తాను ఫిదా అయ్యానని, అవకాశం వస్తే ఆమెతో కలిసి థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అలియా మనస్సులో మాట విన్న డైరెక్టర్లు ఇక కథలు రాసే పనిలో పడిపోవాలేమో.. ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. థ్రిల్లర్ కాన్సెప్ట్.. ఇంకేముంది సినిమా హిట్.. మరి ఈ ఇద్దరిని కలిపే ఆ డైరెక్టర్ ఎవరో చూడాలంటున్నారు సామ్- అలియా అభిమానులు.