సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో అనతి కాలంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అలియా భట్. చివరగా వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్ బాలా దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగ్రా’ మూవీతో అలరించింది.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రాగా హిందీ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం ‘ఆల్ఫా’ సినిమాతో తీరిక లేకుండా గడుపుతోంది ఈ భామ. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే గత సంవత్సరం ‘మెట్‌గాలా’ లో అదరగొట్టిన అలియా ఇప్పుడు మరో ఇంటర్నేషనల్ ఈవెంట్ కు రెడీ అవుతోంది.
త్వరలో కేన్స్ చిత్రోత్సవాల్లో సందడి చేయడానికి ముస్తాబవుతుంది అలియా. ఇందులో భాగంగా తాజాగా ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ‘నేను ‘ఆల్ఫా’ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. మే 13 నుంచి మే 24, 2025 వరకు జరగబోయే 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఇండియన్ స్టార్స్ ఎప్పటి నుంచో వస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్, దీపికా పదుకొణె, సోనమ్ కపూర్ లాంటి వాళ్ళు రెగ్యులర్‌గా వస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గొప్ప పండుగ ఇది. ఈ ఏడాది ఇందులో నేను భాగం కావడం కొంచెం భయంగానే ఉంది కానీ.. కేన్స్లో తొలి అడుగు చేయబోతున్నందుకు ఉత్సాహంగా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది అలియా.