అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’, సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ‘ఏజెంట్’ సినిమా టీజర్ గతంలో విడుదలై నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. అఖిల్ మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా, కంప్లీట్ కొత్త మేకోవర్ లో కనిపించి సినీ అభిమానులని ఇంప్రెస్ చేశాడు. ముఖ్యంగా టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ గన్స్ ఫైర్ చేస్తుంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ… అఖిల్ ని నెక్స్ట్ పాన్ ఇండియా స్టార్ అవుతాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు. స్టైలిష్ మేకర్ గా పేరున్న సురేందర్ రెడ్డి, అఖిల్ లాంటి అల్ట్రా మోడరన్ హీరో దొరకగానే.. తన పొటెన్షియాలిటి మొత్తం తెరపై చూపించడానికి రెడీ అయినట్లు ఉన్నాడు.
2023 జనవరికి ఆడియన్స్ ముందుకి రావాల్సిన ‘ఏజెంట్’ సినిమా అనివార్య కారణాల వలన వాయిదా పడింది. సంక్రాంతి సీజన్ నుంచి సమ్మర్ సీజన్ ని ఏజెంట్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో గత కొన్ని రోజులుగా పెద్దగా హడావుడి లేకుండా ఏజెంట్ సినిమా షూటింగ్ సైలెంట్ గా చేసేస్తున్నారు. ఇటివలే మొదలైన ఒక యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్, ఏజెంట్ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. కేవలం ముప్పై సెకండ్ల వీడియోతో సురేందర్ రెడ్డి, అఖిల్ లు కలిసి ‘అరాచకం’ అనే పదానికి స్పెల్లింగ్ రాయించేసారు. ఇంటెన్స్, హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేసిన సురేందర్ రెడ్డి… చిన్న మేకింగ్ వీడియోతోనే ఆడియన్స్ ని స్టన్ చేసి, ఏజెంట్ సినిమా ఏ రేంజులో తెరకెక్కుతుందో చెప్పేశాడు. ముఖ్యంగా ఏజెంట్ మేకింగ్ వీడియో ఎండ్ లో ‘అఖిల్’ వాకింగ్ షాట్ అయితే విజిల్ వర్త్ అనే చెప్పాలి. ఇదే జోష్ సినిమా మొత్తం ఉంటే అఖిల్ ‘ఏజెంట్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టినట్లే.