Akira Nandan: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురయ్యింది అని పవన్ ఫ్యాన్స్ పాటలు పాడేసుకుంటున్నారు. ఎందుకు.. అంటారా..? మరి పవన్ వారసుడు రాక కోసం అభిమానులు ఎన్ని ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం వచ్చేసింది. అంటే.. ఇప్పుడే సినిమా మొదలు పెట్టడం లేదు.. కానీ, నటనలో నైపుణ్యం పెంచుకోవడానికి ఫిల్మ్ స్కూల్ లో చేరాడు. దానికెందుకు అంతగా చెప్పాలి అంటే.. కారణం ఉంది. పవన్ వారసుడిగా అకీరా నందన్ ఉన్నప్పటికీ.. తల్లి రేణు దేశాయ్ దగ్గరనే అకీరా పెరుగుతున్నాడు. ఎన్నోసార్లు రేణు.. అకీరాకు సినిమాలు అంటే ఇష్టం లేదని, ఇప్పుడప్పుడే సినిమాల్లో అకీరా కనిపించే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చింది. ఇంకోపక్క అకీరా సైతం మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్, పియానో అంటూ తన స్కిల్స్ అన్ని చూపించాడు కానీ, ఏ రోజు సినిమా అంటే ఇష్టం అన్నట్లు బిహేవ్ చేయలేదు. దీంతో ఈ కుర్రాడు ఇండస్ట్రీలో అడుగుపెట్టే ఛాన్స్ లేదేమో అని అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు.
Keerthi Bhat: హీరోతో ‘కార్తీక దీపం’ హీరోయిన్ ఎంగేజ్ మెంట్.. ఫొటోస్ వైరల్
ఇక తాజాగా అకీరా ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవ్వడం అనేది వారికి పండగ లాంటి న్యూస్ అనే చెప్పాలి. 19 ఏళ్లకు అకీరా.. అమెరికాలోని ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అయ్యాడు. అంటే.. మరో రెండేళ్లలో అకీరా టాలీవుడ్ ఎంట్రీ కన్ఫర్మ్ అని చెప్పాలి. ఇక అకీరాతో పాటు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మనవడు కార్తికేయ సైతం ఫిల్మ్ స్కూల్ లో చేరాడు. ఈ విషయాన్నీ రాఘవేంద్రరావునే స్వయంగా చెప్పుకొచ్చాడు. “నాలుగో జనరేషన్ బాయ్స్ తో KRR. నా మనవడు కార్తికేయ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ .. ఇద్దరు అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరారు” అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫొటోలో ఒకపక్క అకీరా, ఇంకోపక్క కార్తికేయను పట్టుకొని రాఘవేంద్రరావు నిలబడ్డాడు. ఇక అకీరా లుక్ మాత్రం అదిరిపోయిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి అకీరా డెబ్యూను పవన్ ఏ రేంజ్ లో చేస్తాడో చూడాలి.