అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కావడానికి రెడీగా ఉంది. మోస్ట్ స్టైలిష్ వైల్డ్ సాలాగా అఖిల్ ఏజెంట్ సినిమాలో కొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరిగాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా లాస్ట్ కంటెంట్, ‘వైల్డ్ సాలా’ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. షూటింగ్ అంతా అయిపోయాక, ప్రమోషన్స్ కూడా చివరి స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇటివలే ఈ సాంగ్ ని షూట్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెల్లా, అఖిల్ తో డాన్స్ ఈ స్పెషల్ సాంగ్ కి డాన్స్ చేసింది. అఖిల్, ఊర్వశిలు హై ఎనర్జీతో ఈ సాంగ్ కి మంచి జోష్ తెచ్చారు. ఏజెంట్ మూవీకి హిప్ హాప్ తమిళ మ్యూజిక్ ఇచ్చాడు కానీ ఈ ‘వైల్డ్ సాలా’ సాంగ్ ని మాత్రం భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేశాడు. శ్రవణ భార్గవి పాడిన ఈ సాంగ్ ప్రమోషన్స్ కి మంచి క్లోజింగ్ ఇచ్చింది. ఇదే జోష్ ని ఏజెంట్ మేకర్స్ ఏప్రిల్ 28 వరకూ మైంటైన్ చేస్తే చాలు… అఖిల్ ఖాతాలోకి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చినట్లే.
Read Also: Payal Rajput: ఆ సీతాకోక చిలుక ఎంత బాగుందో…
అయితే పొన్నియిన్ సెల్వన్ 2, విరుపాక్ష సినిమాల రూపంలో ఏజెంట్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉంది. పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాపై అంతగా హైప్ లేకపోయినా ‘ఏ’ సెంటర్స్ లో మాత్రం ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉంది. మరివైపు విరుపాక్ష సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతోంది. రోజు రోజుకీ మౌత్ టాక్ స్ప్రెడ్ అవుతూ ఉండడంతో విరుపాక్ష మూవీ బుకింగ్స్ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏజెంట్ సినిమాకి ఉన్న బిగ్గెస్ట్ త్రెట్ విరుపాక్ష మూవీనే. ఈ థ్రిల్లర్ మూవీ మాయ నుంచి ఆడియన్స్ బయటకి వచ్చి ఏజెంట్ సినిమాని చూడాల్సి ఉంటుంది. మరి సెన్సేషనల్ బుకింగ్స్ రాబడుతున్న విరుపాక్షని దాటి ఏజెంట్ మూవీని ఆడియన్స్ చూస్తారా? అది కూడా వారం రోజుల గ్యాప్ లోనే అనే ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే ఏప్రిల్ 28 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
Get ready to go ballistic in theatres with this WILD Mass number🔥
The Highly Energetic #WildSaala Song from #AGENT is out now!
– https://t.co/qD8T3kqpwD#AgentOnApril28th@AkhilAkkineni8 @UrvashiRautela @DirSurender #BheemsCeciroleo @AnilSunkara1 @LahariMusic @TSeries pic.twitter.com/VDdctBxNCO
— AK Entertainments (@AKentsOfficial) April 25, 2023
https://www.youtube.com/watch?v=hIOdfVIsmmM