Akhanda Sequel with Balakrishna is in Allu Aravind’s Geetha Arts>: ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను-అల్లు అరవింద్ పక్కపక్కనే నిలబడి ఉన్న ఫొటో ఒకటి రిలీజ్ చేసింది గీతా ఆర్ట్స్ సంస్థ. అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను- అల్లు అరవింద్ కాంబినేషన్లో సరైనోడు సినిమా తరువాత మళ్ళీ కాంబో రిపీట్ అవుతుందని హిట్ ఇచ్చేలా పోస్ట్ పెట్టడంతో అనేక రకాల కామెంట్లు తెర మీదకు వచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ – బోయపాటి శ్రీను- అల్లు అరవింద్ కాంబోలో ఒక సినిమా అనౌన్స్ చేయవచ్చని అందరూ భావించారు. అయితే అది నిజం కాదని అంటున్నారు. ఈ మేరకు ఫిలిం నగర్లో అయితే సరికొత్త చర్చ జరుగుతోంది. అఖండ ఘనవిజయం తర్వాత బోయపాటి శ్రీను, బాలకృష్ణ త్వరలో అఖండ 2 కోసం మళ్లీ కలిసి పనిచేయనున్నారని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ అల్లు అరవింద్ ప్రొడక్షన్‌లో రూపొందనుంది. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ మరియు బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ సర్రైనోడు తర్వాత పాన్-ఇండియా పెద్ద సినిమా కోసం చేతులు కలుపుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
Breaking News : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఈ ప్రాజెక్ట్ ఇంకేమిటో కాదు అఖండ 2 అని ఇప్పుడు తేలింది. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ పతాకంపై అఖండను నిర్మించి భారీ విజయాన్ని సాధించింది. ఇక ఆ తరువాత బాలకృష్ణ వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు చేసి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ మార్చి నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత బాలకృష్ణ ఈ ఏడాది చివర్లో జరగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల రాజకీయ ప్రచారానికి విరామం తీసుకోనున్నారు. ఈ విరామం తర్వాత బాలయ్య తన అఖండ 2 షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడని అంటున్నారు. అల్లు అరవింద్ చాలా కాలంగా బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. బాలయ్య మరియు అల్లు అరవింద్‌లు ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో ఆన్ ఆహా కలిసి చేశారు. ఆ షో భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు బాలయ్య, బోయపాటి మరియు అల్లు అరవింద్‌ల ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి.