తల అజిత్ కి తమిళనాడులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్క ప్రెస్ మీట్ పెట్టక పోయినా, ఒక్క ఈవెంట్ చెయ్యక పోయినా అజిత్ సినిమాలు కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి అంటే అది అజిత్ ఫ్యాన్ బేస్ కి నిదర్శనం. రీసెంట్ గా సంక్రాంతికి ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన అజిత్, బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టాడు. 180 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టిన తునివు సినిమా అన్ని సెంటర్స్ లో లాభాలు రాబడుతోంది. తునివు సినిమాకి పోటీగా రిలీజ్ అయిన విజయ్ ‘వారిసు’ మూవీ 200 కోట్లని రాబట్టింది కానీ ఎక్కువ రేట్ కి అమ్మిన కారణంగా కొన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ కాలేదు అనే మాట కోలీవుడ్ లో వినిపిస్తోంది. దీంతో క్లీన్ హిట్ గా నిలిచిన తునివు సినిమానే సంక్రాంతి విన్నర్ అంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Dasara: నాని సినిమాకి ఈ రేంజ్ ఈవెంట్స్ ఎప్పుడూ చూడలేదు…
తునివు సినిమా అయిపోవడంతో ఇప్పుడు అజిత్ ఫాన్స్ దృష్టి అంతా ‘AK62’ సినిమాపై పడింది. అజిత్ 62వ సినిమాగా తెరకెక్కాల్సిన ఈ మూవీకి ముందుగా విజ్ఞేశ్ శివన్ దర్శకుడని అంతా అనుకున్నారు. ఆ తర్వాత కాదు అజిత్ నెక్స్ట్ సినిమాని డైరెక్ట్ చేసేది ఇతనే అంటూ అట్లీ, హెచ్ వినోద్, మగిళ్ తిరుమేణి పేర్లు వినిపించాయి. దీంతో అజిత్ నెక్స్ట్ మూవి ఎవరితో అనే డౌట్ అందరిలో రైజ్ అయ్యింది. ఇప్పటికే హెచ్. వినోద్ తో అజిత్ మూడు సినిమాలు చేసేసాడు కాబట్టి అప్పుడే మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా ఉండడు. అట్లీ, షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయ్యే వరకూ అట్లీ-అజిత్ కాంబినేషన్ లో సినిమా ఉండడు. ఇక తిరుమేణి ఇప్పటివరకూ స్టార్ హీరోని డైరెక్ట్ చెయ్యలేదు కాబట్టి అజిత్ తో మూవీ చేసే ఛాన్స్ ఇప్పట్లో రాకపోవచ్చు. సో అజిత్ నెక్స్ట్ మూవీ దాదాపు విజ్ఞేశ్ శివన్ తోనే ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ పైన లిస్టులో ఉన్న దర్శకులతో అజిత్ సినిమాలు చెయ్యడానికి రెడీగా ఉన్నా అవి AK62 తర్వాతే సెట్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది.
Read Also: Khushi: త్వరలో మొదలవ్వనున్న దేవరకొండ, సమంతా సినిమా