కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు.. తమిళ్ లోనే కాదు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఇటీవల అజిత్ నటించిన వలిమై అన్ని భాషల్లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దిరోజులుగా అజిత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. నిజం చెప్పాలంటే అజిత్ ఒక్కడి గురించే కాదు కోలీవుడ్ స్టార్ హీరోలు రజినీకాంత్, ధనుష్, విజయ్ లు కూడా రాజకీయ రంగప్రవేశం చేయనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వారందరు పలు సందర్భాల్లో తమకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చారు. ఇక తాజగా అజిత్ రాజకీయ రంగప్రవేశం గురించి కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
త్వరలోనే అజిత్ రాజకీయాలలోకి వస్తున్నాడని, సినిమాలు పూర్తిగా ఆపేయడమో.. అప్పుడప్పుడు చేయడమో చేస్తాడని ఆ వార్తల సారాంశం. అయితే తాజాగా ఈ వార్తలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఖండించారు. ” అజిత్ సార్ కి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం కానీ ఆసక్తి కానీ లేదు.. దయచేసి ఇలాంటి ఫేక్ న్యూస్ ని ప్రచారం చేయకండి. అభిమానులు ఇలాంటి వార్తలను నమ్మకండి “అంటూ చెప్పారు. దీంతో అజిత్ కూడా రాజకీయాల్లోకి రావడం లేదని కన్ఫర్మ్ అయ్యింది. దీంతో అభిమానులు మంచిగా సినిమాలు చేసుకోండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు