బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ రీసెంట్ గా ‘దృశ్యం 2’ సినిమాతో 250 కోట్లు కలెక్ట్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. మరోసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అజయ్ దేవగన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోలా’. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయిన కార్తీ ‘ఖైదీ’ సినిమాకి ‘భోలా’ రీమేక్ వర్షన్. లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ చేసిన ఖైదీ సినిమా, ఒక రాత్రిలో జరిగే కథతో రూపొందింది. ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ కి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. దీంతో అజయ్ దేవగన్ ఖైదీ సినిమా రైట్స్ కొనుక్కోని, తన సొంత దర్శకత్వంలోనే ‘భోలా’గా ఖైదీని తెరకెక్కిస్తున్నాడు. అయితే ‘భోలా’ సినిమాని రీమేక్ చెయ్యాలి అనుకున్నప్పుడు అజయ్ దేవగన్ కి ఖైదీ ప్రొడ్యూసర్స్, ఆ సినిమా CDని మార్చేసి ఇచ్చినట్లు ఉన్నారు లేదా అజయ్ దేవగన్ అఖండ సినిమా రైట్స్ ని కూడా కొనుక్కోని ఉండాలి. రెండు సినిమాలు ఎందుకు చెయ్యడం? అఖండ, ఖైదీలని కలిపి ఒకే సినిమా చేసేస్తే అయిపోతుంది కదా అనుకున్నట్లు ఉన్నాడు. అందుకే భోలా సినిమా నుంచి వచ్చిన ఏ ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా అది ఖైదీ సినిమాలాగా అనిపించకుండా అఖండ సినిమాలా అనిపిస్తుంది.
టీజర్ నుంచి పోస్టర్స్ వరకూ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ తో ఇదే డౌట్ ని రైజ్ చేస్తున్న అజయ్ దేవగన్, తాజాగా ‘శివ రాత్రి’ పండగ రోజు పోస్ట్ చేసిన ఫోటోస్ కూడా అదే డౌట్ ని కంటిన్యు చేశాయి. భోలా షూటింగ్ లో భాగంగా, శివ పూజా చెయ్యడం ఆనందాన్ని ఇచ్చింది అని అజయ్ దేవగన్ కొన్ని ఫోటోస్ పోస్ట్ చేశాడు. శివరాత్రి రోజు శివ పూజా చెయ్యడం వరకూ బాగానే ఉంది కానీ భోలా సినిమా షూటింగ్ లో భాగంగా అనే మాటనే ఇబ్బంది పెడుతుంది. అసలు ఖైదీ సినిమాలో డే ఎఫెక్ట్ ఉండదు, నైట్ ఎఫెక్ట్ లో లారీ ట్రావెల్ లోనే సినిమా కంప్లీట్ అవుతుంది. మరి అజయ్ దేవగన్ భోలా సినిమాలో ఎలాంటి మార్పులు చేశాడో తెలియదు కానీ అసలు ఖైదీ సినిమా రీమేక్ అనే ఫీలింగ్ ని మాత్రం రానివ్వట్లేదు.
हर हर महादेव pic.twitter.com/LtsI7kq4qT
— Ajay Devgn (@ajaydevgn) February 18, 2023