Ajay Bhupathi Interesting Comments on Mangalavaram Title:’ఆర్ఎక్స్ 100′, ‘మహాసముద్రం’ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘మంగళవారం’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 17న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ .ఎం నిర్మిస్తుండగా పాయల్ రాజ్‌పుత్, అజ్మల్ అమిర్ జంటగా నటించారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ‘మంగళవారం’ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇక ఈ క్రమంలో అజయ్ భూపతి మాట్లాడుతూ KCW కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ సంస్థలో ‘ఆర్ఎక్స్ 100’ ద్వారా నేను పరిచయం అయ్యానని, ఆ సినిమాకు కార్తికేయ హీరో, ఆయనే ప్రొడ్యూసర్. ఇప్పుడు నేను ACW (అజయ్ భూపతి క్రియేటివ్ వర్క్స్) సంస్థను ప్రారంభించా, భవిష్యత్తులో KCW, ACW కలుస్తాయేమో చూడాలని అన్నారు. టెక్నీషియన్లు అందరికీ థాంక్స్ చెప్పిన ఆయన ఇది ఒక డార్క్ థ్రిల్లర్ అని, డిఫరెంట్ జానర్ సినిమా తీశానని అన్నారు.
Tiger Nageswara Rao: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా వేస్ట్ బ్రో..
అంతకు మించి ఏమీ చెప్పలేనని పేర్కొన్న ఆయన ఈ తరహా విలేజ్ & నేటివిటీతో కూడిన డార్క్ థ్రిల్లర్ తీయడం ఇంకా కష్టమని అన్నారు. ఫుల్ స్క్రిప్ట్ పట్టుకుని షూటింగ్ చేయాలని, ఎవరూ టచ్ చేయని పాయింట్ టచ్ చేశానని అన్నారు. ‘ఆర్ఎక్స్ 100’ని ఆదరించినట్టు ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నానని ‘మంగళవారం’ టైటిల్ వెనుక కారణం ఉంది, అది సినిమా చూస్తే తెలుస్తుందని అన్నారు. దేవతలకు ఇష్టమైన రోజు మంగళవారం అందుకే దానిని జయవారం అని కూడా అంటారు. ఎవరో కొందరు పిచ్చ పిచ్చ సామెతలు చెబుతారు, వాటిని పట్టించుకోవద్దని అన్నారు. ఇది ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని అనను కానీ మహిళలకు సంబంధించిన పాయింట్ టచ్ చేశామని అన్నారు.