Tiger Nageswara Rao: ఈ మధ్య కాలంలో మూడు గంటలు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టే సినిమా ఒక్కటి కూడా లేదు అంటే అతిశయోక్తి లేదు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అయినా కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తేనే టైమ్ చూడకుండా సినిమా చూడగలరు. లేకపోతే.. 2 గంటలు ఎక్కువ ఈ సినిమాకు అని చెప్పేస్తారు. ఇక రన్ టైమ్ కోసం సాగదీత సీన్స్ పెట్టి.. ప్రేక్షకులను బోర్ కొట్టించడం మేకర్స్ కు అలవాటు గా మారిపోయింది. దీనివలన సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఎంతసేపటికి చెప్పిందే చెప్పడం.. అనవసరమైన సీన్స్.. సాంగ్స్.. లేని పాత్రలను ఇరికించడం వలన అసలు పాయింట్ నుచెప్పే సమయానికి ప్రేక్షకుడుకు ఇంట్రెస్ట్ పోతుంది. తాజాగా టైగర్ నాగేశ్వరరావుకు కూడా అదే అయ్యింది. మాస్ మహారాజా రవితేజ మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు తెరకెక్కింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యి.. మిక్స్డ్ టాక్ ను అందుకుంది.
Madonna Sebastian: బ్లాక్ డ్రెస్సులో మత్తెక్కిస్తున్న మడొన్నా సెబాస్టియన్
ఇక ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 29 నిముషాలు ఉండడమే మిక్స్డ్ టాక్ కు కారణమని ప్రేక్షకులు చెప్తున్నారు. సినిమా రిలీజ్ కు ముందే రన్ టైమ్ ను తగ్గించమని కొందరు చెప్పినా కూడా డైరెక్టర్ వంశీ వినకుండా 3 గంటల 29 నిముషాలు ఉంచేశాడు. దీనివలన అంతసేపు ప్రేక్షకులు కూర్చోలేకపోయారు. అంతేకాకుండా.. కొన్ని సీన్స్ మరి సాగదీతగా ఉండడంతో సినిమాపై ఇంట్రెస్ట్ రాలేదని చెప్పుకొస్తున్నారు. దీనివల్లనే సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకుందని అంటున్నారు. దీంతో చేసేది ఏం లేక దాదాపు 24 నిమిషాల సీన్లని కట్ చేసి పడేశారు. ఇకపై 2 గంటల 37 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం. మొదట టాక్ సినిమాకు ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టాక్ వచ్చాక సినిమా రన్ టైమ్ తగ్గించినా.. పెంచినా ప్రయోజనం ఏముంటుంది అని కొందరు పెదవి విరుస్తున్నారు. మరి రేపటి నుంచి ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.