అక్కినేని సుమంత్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. హిట్లు లేకపోయినా సుమంత్ వరుస అవకాశాలను అందుకొంటూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బాగా గట్టిగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథతో వచ్చేశాడు. ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ సంయుక్త నిర్మాణంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లిట్చ్ ను ట్యాలెంటెడ్ హీరో అడివిశేష్ ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తూ చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ ఫస్ట్ గ్లిట్చ్ లో సుమంత్ ఆర్జే నిలయ్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్జే నిలయ్ కు ఒకరోజు ఒక కాలర్ ఫోన్ చేసి తాను కిడ్నాప్ అయ్యినట్లు తెలుపుతుంది. తనను కొంతమంది కిడ్నప్ చేశారని, ఒక డార్క్ రూమ్ లో తనను బంధించి ఉంచారని చెప్తుంది.. కిడ్నాప్ అయిన యువతిని ఆర్జే నిలయ్ ఎలా కాపాడాడు..? వారి నుంచి ఆ యువతిని అతడు రక్షించాడా..? లేదా..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ఈ వీడియోతో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.. ఇక శ్రీరామ్ మద్దూరి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అని చెప్పొచ్చు.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతోనైనా సుమంత్ హిట్ ను అందుకుంటాడా..? లేదా అనేది చూడాలి.