అక్కినేని సుమంత్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే.. హిట్లు లేకపోయినా సుమంత్ వరుస అవకాశాలను అందుకొంటూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు. ఇటీవలే మళ్లీ మొదలైంది చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయాడు. ఇక ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని బాగా గట్టిగా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే విభిన్నమైన కథతో వచ్చేశాడు. ప్రశాంత్ సాగర్ దర్శకత్వంలో సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. వాయుపుత్ర ఎంటర్ టైన్…