NTR: నందమూరి బాలకృష్ణ.. ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో మొదలుపెట్టాడో అప్పటినుంచి ఆయన రేంజ్ మొత్తం మారిపోయింది. బాలయ్య.. హోస్ట్ గా చేస్తున్నాడా.. ? అది వర్క్ అవుట్ అవ్వదు అన్న వారే.. షో చేస్తే ఆయనే చేయాలి అని అంటున్నారు అంటే .. బాలయ్య ఏ రేంజ్ లో షోను సక్సెస్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మొదటి సీజన్ తోనే ఈ షో ఆగిపోతుంది అనుకున్నారు. కానీ, బాలయ్య తనదైన మాటతీరుతో.. నవ్విస్తూ, కవ్విస్తూ.. చురకలు వేస్తూ.. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలను, రాజకీయ నాయకులను సైతం తన ప్రశ్నలతో సందిగ్ధంలో పెట్టి ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు. ఇక ఇప్పటికే రెండు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య .. మూడో సీజన్ కు రెడీ అవుతున్నట్లు వార్తలు చెప్పుకొస్తున్నారు. అసలు ఈపాటికి అన్ స్టాపబుల్ సీజన్ 3 కు ఏర్పాట్లు మొదలుకావాల్సి ఉండగా.. మధ్యలో కొన్ని సమస్యలతో బాలయ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.
Rudramkota: సీరియల్ డైరెక్టర్ టు సినిమా డైరెక్టర్.. జక్కన్నే ఇన్స్పిరేషనట!
రాజకీయపరంగా ప్రస్తుతం బాలకృష్ణ ఒడిడుకులను ఎదుర్కొంటున్నాడు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో .. ఆయనను బయటకు తీసుకొచ్చే పనుల్లో తిరుగుతున్నాడు. ఇక దీనివలన కొద్దిగా షో ఆలస్యం అవుతుందని సమాచారం. అయితే షో కోసం ఆహా ఈసారి గట్టిగా ప్లాన్ చేసిందని సమాచారం. చిరంజీవి దగ్గరనుంచి కేటీఆర్ వరకు చాలామంది సెలబ్రిటీస్ ను గెస్ట్ లుగా రావాలని ఆహ్వానించిందని తెలుస్తోంది. ఇక ఈ గెస్ట్ ల లిస్ట్ లో రామ్ చరణ్, చిరంజీవి, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, విక్టరీ వెంకటేశ్ లతో పాటు ఎన్టీఆర్ కూడా రానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు వచ్చినా.. రాకపోయినా అభిమానులు అంతగా పట్టించుకోరు కానీ, బాబాయ్- అబ్బాయ్ అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. ఈ కాంబో స్టేజిపైనే కనిపిస్తేనే సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది.
Tapsee Pannu: లగ్జరీ కారు కొన్న సొట్టబుగ్గల సుందరి.. రేటు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే
ఇక బాబాయ్.. అబ్బాయ్ ను ఇంటర్వ్యూ చేస్తే.. ఇండస్ట్రీనే షేక్ అవుతోంది అని అంటున్నారు. ఇక ఇంకోపక్క చంద్రబాబు అరెస్ట్ ముందు ఈ మాట అంటే కనీసం వస్తాడు అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు అయితే అస్సలు అది కూడా లేదు.. అది జరగదు అని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. రేపు ఆ షోకు వెళ్తే.. ఎన్నో నిజాలు బయటకు వస్తాయి. అవన్నీ బాబాయ్- అబ్బాయ్ లు బయటపెడతారు అనేది ఎవరికి తెలియదు.. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్య వీరిద్దరు కలుస్తారు అనేది అసాధ్యమని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.