Unstoppable 2: బిగ్ బ్రేకింగ్.. ప్రభాస్ ఎపిసోడ్.. నిమిషాల్లోనే క్రాష్ అయిన ఆహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Unstoppable 2: ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు ప్రభాస్ మొదటిసారి గెస్ట్ గా వచ్చాడు. గత కొన్నిరోజుల క్రితం షూటింగ్ జరిగినా ఆహా మేకర్స్ మాత్రం అభిమానులను ఊరిస్తూ ఊరిస్తూ కొత్త ఏడాది కానుకగా డిసెంబర్ 30 న మొదటి పార్ట్ ను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయినా అభిమానులు గోల చేస్తుండడంతో ఒకరోజు ముందే ఆహాలో ప్రభాస్ ఎపిసోడ్ ను స్ట్రీమ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనుకున్నట్లుగానే కొద్దిసేపటి క్రితం అనగా ఈరోజు రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది.
ఎప్పుడెప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని ఆహా ముందే కూర్చున్న అభిమానులు టైమ్ అవ్వగానే ఒక్కసారిగా క్లిక్ చేయడంతో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. ఓవర్ లోడ్ కావడంతో ఎపిసోడ్ ఆగిపోయింది. దీంతో ఆహా మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ అంతరాయానికి చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.. ” డార్లింగ్ ప్రభాస్ అభిమానుల ప్రేమతో ఓవర్‌లోడ్ అవ్వడం వలన మా యాప్ క్రాష్ అయిందని మీకు తెలియజేయడానికి క్షమించండి..మేము దానిపై పని చేస్తున్నాము.. త్వరలోనే మేము ముందుకు వస్తాం” అని తెలిపింది. దీంతో అభిమానుల గుండెలు బద్దలైయిపోయాయి. మరోసారి వారికి నిరాశే ఎదురయ్యింది. మళ్లీ ఈ ఎపిసోడ్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూడక తప్పడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
- AA 23 : అల్లు అర్జున్ - లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
- Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో... ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
- Janhvi Kapoor: 'పెద్ది' అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
https://twitter.com/ahavideoIN/status/1608492424091029507?s=20&t=5czl63ncb2Kgo1JEDiE7ow
తాజావార్తలు
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
Kitchen Hacks: గ్యాస్ బర్నర్లు నల్లగా మారిపోయాయా? ఇలా చేస్తే నిమిషాల్లో కొత్త వాటిలా మెరిసిపోతాయి!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!