Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Itlu Arjun: కింగ్ నాగార్జున సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి, రోజురోజుకూ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ‘శివ’ థియేటర్లో నిర్వహించిన సక్సెస్ మీట్లో నాగార్జున పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విజయానికి సంబంధించిన క్రెడిట్ అంతా చిత్రబృందానిదేనని, ఇందులో తన పాత్ర కేవలం చివర్లో వచ్చి ప్రెజెంట్ చేయడం వరకేనని ఆయన నిరాడంబరంగా చెప్పారు. సినిమాకు షో షోకు మౌత్ టాక్ పెరగడంతో పాటు కలెక్షన్లు పుంజుకోవడంపై నాగార్జున హర్షం వ్యక్తం చేశారు. “ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ నేను అస్సలు తీసుకోను. నేను ఏదో పైపై మాటలుగా చెప్పడం లేదు, మనస్ఫూర్తిగా చెబుతున్నాను. రెండున్నరేళ్ల పాటు ఎంతో ప్యాషన్, కమిట్మెంట్తో ఈ చిత్రబృందం ఈ సినిమాను చెక్కుకుంటూ ఇంతదూరం తీసుకొచ్చారు. అసలైన కష్టమంతా వారిదే. నేను కేవలం చివర్లో వచ్చి సినిమా చూసి, నాకు నచ్చి ప్రెజెంట్ చేస్తానని ముందుకు వచ్చాను. నేను ప్రెజెంట్ చేసినందుకు నా మాట నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది” అంటూ నాగార్జున ‘హార్ట్ బస్టర్’ సక్సెస్ క్రెడిట్ మొత్తాన్ని టీమ్‌కు ఇచ్చేశారు.
తొలి సినిమాలోనే మాటలు రాని మూగవాడి పాత్రను ఎంచుకుని అనీష్ డిస్టింక్షన్లో పాస్ అయ్యాడని నాగార్జున మెచ్చుకున్నారు. అలాగే తెలుగు తెలియకపోయినా అనశ్వర రాజన్ అద్భుతంగా నటించిందని, సినిమా చూసిన వెంటనే తాను ఆమెకు పెద్ద అభిమానిగా మారిపోయానని తెలిపారు. మాటలు రాని అబ్బాయి, ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండే అమ్మాయి మధ్య కథను దర్శకుడు మహేష్ ఎంతో బ్యాలెన్స్డ్గా నడిపించారని, ఆయన ‘లంబీ రేస్ కా ఘోడా’ అని కొనియాడారు. ఇక తమన్ తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను నిలబెట్టారని ప్రశంసించారు. ఇదే సమయంలో, ఈ సినిమాలో అనీష్ రూఫ్ మీద పరిగెత్తే షాట్ చూసి ముచ్చటపడే డీవోపీ రాజాను తన ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’కు సినిమాటోగ్రాఫర్‌గా తీసుకున్నట్లు నాగార్జున వెల్లడించారు. అలాగే ‘శివ’ సినిమా ఫస్ట్ కాపీ చూసింది ఇదే థియేటర్లో అని గుర్తుచేసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
Also Read
- Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
- Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
- Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
- #AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Itlu Arjun సక్సెస్ క్రెడిట్ నాది కాదు.. ఆ హార్డ్ వర్క్ అంతా వారిదే: నాగార్జున
-
Giribabu Death:బాధతో మాటలు రావడం లేదు’.. గిరిబాబు మృతిపై మోహన్ బాబు ఎమోషనల్!
-
Nagarjuna: నా ట్రాక్ రికార్డ్ చూడండి ఫ్లాప్ అయితే కాలేదు.. సినిమా ప్రెజెంటేషన్‌పై నాగార్జున బోల్డ్ కామెంట్స్!
-
Divija: తమిళ్ సినిమాలో హీరోయిన్ గా ఈటీవీ ప్రభాకర్ కూతురు
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!