Agent: ప్రామిసింగ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ సినిమాతో పాన్ ఇండియాలో అడుగుపెడుతున్నాడు. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సుంకర రామబ్రహ్మం నిర్మించిన ఈ సినిమాను ఏకంగా ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కారణాలు ఏవైనా క్రిస్మస్ కు రావాల్సిన ఈ సినిమా ఆ తర్వాత సంక్రాంతికి మారింది. ఇప్పుడు సంక్రాంతి రేస్ నుండి కూడా తప్పుకుందని ఫిల్మ్ నగర్ టాక్. ఫిబ్రవరి 16న శివరాత్రి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాత సుంకర రామబ్రహ్మం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ‘ఏజెంట్’లో మమ్ముట్టి నేషనల్ సెక్యురిటీ ఏజెన్సీహెడ్ మహదేవ్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అజయ్ సుంకర, పతి దీపారెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో విడుదల కానుంది.