Nagavamsi : ప్రొడ్యూసర్ నాగవంశీ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్-2 డిజాస్టర్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేసిన నాగవంశీ చాలానే నష్టపోయాడనే వార్తలు వచ్చాయి. తర్వాత ఓ ఇంటర్వ్యూలో అది నిజమే అని ఒప్పుకున్నాడు నాగవంశీ. అయితే వార్-2 దెబ్బతో ఇప్పుడు ఇదే స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న ‘ఆల్ఫా’ అనే సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాను నాగవంశీ రిలీజ్ చేయాల్సి ఉంది.
Read Also : Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్
ఆలియా భట్, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటించగా ఈ సినిమా వీఎఫ్ ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదనే నెపంతో మూవీని ఏప్రిల్ 17కు వాయిదా వేశారు మూవీ మేకర్స్. వార్-2 ఎఫెక్ట్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఈ స్పై యూనివర్స్ మీద ఇప్పటికే తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఒకే కథను ఎన్ని సార్లు తిప్పి తిప్పి తీస్తారంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు. అందుకే ఈ నిర్మాణ సంస్థ సినిమాను నాలుగు నెలలు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. కథలో కీలక మార్పులు చేసి రీ షూట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : SSMB 29 : మహేశ్ మూవీకి టైటిల్ ఇష్యూ.. రాజమౌళికి ఏం చేస్తాడో..?