Adivi Sesh: సొంతం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ తో అడివి శేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. సినిమాల మీద ఉన్న మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని వదిలి.. ఇండియా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డాడు. కర్మ అనే సినిమాను తన సొంత డబ్బుతో నిర్మించి కొంతవరకు నష్టపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా శేష్ కు ఒక గుర్తింపును తీసుకొచ్చి పెట్టడమే కాకుండా బాహుబలిలో నటించే ఛాన్స్ వచ్చేలా చేసింది. ఇక హీరోగా, రైటర్ గా మారి క్షణం సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ ఒక్క సినిమా శేష్ ను మళ్లీ వెనక్కి తిరగకుండా చేసింది. గూఢచారి సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్పై గా మారిపోయాడు శేష్. ఎవరు, హిట్, మేజర్, వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాతో పాటు గూఢచారి 2 సినిమాలు చేస్తూ బిజీగా మారాడు.
ఇక ఈ నేపథ్యంలోనే శేష్ ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్రఖ్యాత ఐఎండీబీ మొట్టమొదటి సారి.. తాము రేటింగ్ ఇచ్చిన టాప్ 250 చిత్రాలను ప్రకటించింది. అందులో శేష్ వి మూడు సినిమాలు ఉండడం విశేషం. క్షణం, ఎవరు, మేజర్ లాంటి సినిమాలో ఆ బెస్ట్ మూవీస్ లో నిలిచాయి. దీంతో ఈ కుర్ర హీరో పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే 250 చిత్రాల్లో ఈ సినిమాలు రేటింగ్, ర్యాంకింగ్స్ ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు శేష్ కు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి శేష్ తన తరువాతి ప్రాజెక్ట్స్ తో ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.