ప్రభాస్ హీరోగా ఓంరౌత్ తెరకకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ టీజర్ అయోధ్యలో విడుదల కాబోతోంది. దసరా కానుకగా ఈ టీజర్ ను అయోధ్యలో రిలీజ్ చేయటానకి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా హిందూయిజానికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రామునిగా నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినట్లే ఈ సినిమా టీజర్‌ను ఆవిష్కరించడానికి ప్రత్యేకమైన స్థలాన్ని ఎంపిక చేశారు.
అలా ‘ఆదిపురుష్’ టీజర్‌ను అయోధ్యలో విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరు అవుతారట. ఇటీవల పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన ప్రభాస్ ఈవెంట్‌కి అందుబాటులో ఉంటాడని టాక్. కృతి సనన్ సీతగా నటించిన ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు ఓం రౌత్. గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్సాఫీస్ డీలా పడిన నేపథ్యంలో ‘ఆదిపురుష్’ తో మళ్ళీ కళకళ లాడుతుందని భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో!