Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొట్టమొదటిసారి ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు. ఇక ప్రభాస్ సరసన సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజువల్స్ బాగోలేదని, విఎఫ్ ఎక్స్ సరిగ్గా చేయలేదని, బొమ్మల సినిమా చూసినట్టుందని అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇక ఆ తరువాత ఆ టీజర్ ను 3డి లో చూపించి పర్వాలేదనిపించారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈపాటికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. మొదటి నుంచి ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ తరువాత కొన్ని కారణాల సినిమాను వాయిదా వేశారు. ఇక తాజాగా ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. జూన్ 16 న అన్ని భాషల్లో ఆదిపురుష్ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ” రాముడి యొక్క గొప్పతనాన్ని మీకు తెలియజేయడానికి మేము ఎల్లప్పుడు ఆనందిస్తున్నాం.. 150 రోజుల్లో భారతదేశం యొక్క అనాదిగా వస్తున్న ఇతిహాసానికి ప్రపంచం సాక్ష్యం కానుంది. జూన్ 16 న ఆదిపురుష్ థియేటర్లో రిలీజ్ కానుంది” అంటూ మేకర్స్ తెలిపారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్డేట్ తో పండగ చేసుకుంటున్నారు. అబ్బా.. సాయిరామ్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ఇచ్చేశారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.
ll रामकार्य करने के लिए हम सदैव तत्पर हैं ll
|| We are always delighted to impart the virtue of Lord Ram ||The world will witness India's timeless epic in 150 days! 🏹 #150DaysToAdipurush#Adipurush releases IN THEATRES on June 16, 2023 in 3D.#Prabhas @omraut #SaifAliKhan pic.twitter.com/i5RiJHHeFR
— UV Creations (@UV_Creations) January 17, 2023