Adipurush Characters Names: భారీ అంచనాలతో తెరకెక్కిన ఆది పురుష్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా కృతిసనన్ హీరోయిన్గా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాని ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. టి సిరీస్, రెట్రోఫైల్స్ సంస్థలు భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మించాయి. సుమారు 550 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని వాల్మీకి రాసిన రామాయణ కథ ఆధారంగా తీర్చిదిద్దారు. కథలో పెద్దగా మార్పులు చేయలేదు. సినిమాటిక్ లిబర్టీ కోసం కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో పాత్రధారుల పేర్లు కూడా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో ఏఏ పాత్రలు ఉన్నాయి? ఆ పాత్రల పేర్లు ఏమిటి? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రభాస్ రాఘవ అనే పాత్రలో కనిపిస్తారు. వాస్తవానికి రాముడిని రాఘవ రాముడు, రఘురాముడు అని కూడా పిలుస్తూ ఉంటారు.
కానీ ఈ సినిమాలో రాఘవ అనే పేరుకే పరిమితం చేశారు. సీత పాత్రలో కృతి సనన్ కనిపిస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగింది కానీ ఆమె పాత్ర పేరు మాత్రం జానకి. జనకుడి కుమార్తె కావడంతో ఆమెకు ఆ పేరు ఉంటుందని ముందు నుంచి దాదాపుగా అందరికీ తెలుసు. ఇక సైఫ్ అలీ ఖాన్ ని రావణ పేరుతోనే సంభోదించారు. రామాయణ గాధలో రావణాసురుడు లేదా లంకేషుడు అని పిలుస్తూ ఉంటారు కానీ సినిమాలో రావణ అనే పేరుకే పరిమితం చేశారు. ఇక సినిమాలో లక్ష్మణుడి పాత్ర పేరు శేషు అని పెట్టారు. వాస్తవానికి శ్రీ విష్ణు ఆదిశేషు మీద పవళిస్తాడు, అదే ఆదిశేషుని లక్ష్మణుడిగా జన్మింప చేస్తాడు. అయితే ఆ పాత్రకు శేషు పేరు పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఇక రావణాసురుడి కుమారుడికి పేరు ఇంద్రజిత్తు, సోదరులు కుంభకర్ణుడు, విభీషణుడి పేర్లు మాత్రం మార్చలేదు. ఇక ఆంజనేయస్వామి పేరు మాత్రం బజరంగ్ గా ఉంచారు. కానీ మిగతా పేర్లు కూడా పెద్దగా మార్చలేదు. అదండీ సంగతి