అడివి శేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్ ఫ్రాంచైజ్’ నుంచి వచ్చిన ఈ పార్ట్ 2 రిలీజ్ కి ముందే మంచి అంచనాలని క్రియేట్ చేసింది. థ్రిల్లర్ సినిమాలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, అలాంటిది అడవి శేష్ నటిస్తున్న థ్రిల్లర్ అంటే ఆడియన్స్ ఇంకెన్ని అంచనాలు పెట్టుకోని థియేటర్స్ కి వస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వచ్చే ఆడియన్స్ ని మెప్పించడం చాలా కష్టమైన విషయం. అంచనాలని మించి మెప్పించగలిగేతే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. మరి ‘హిట్ 2’ సినిమా ఆడియన్స్ ని ఎంతవరకూ ఆకట్టుకుంది. ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ లో ఎలాంటి రివ్యూస్ ఇస్తున్నారో చూద్దాం.
‘హిట్ 1’కి సీక్వెల్ గా వచ్చిన ‘హిట్ 2’ చూసిన ఆడియన్స్… సినిమాకి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఒకరు సినిమా సూపర్ హిట్ అంటే, ఇంకొకరు పర్లేదు ఒకసారి చూడొచ్చు అంటున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది కానీ సెకండ్ హాఫ్ లో హై లేదు. కిల్లర్ ని రాంగ్ కాస్టింగ్ చేశారని కొంతమంది ట్వీట్ చేస్తుంటే, మరికొంతమందేమో కిల్లర్ పార్ట్ సూపర్ ఉంది అంటున్నారు. ఇలా ‘హిట్ 2’ చూసిన వాళ్లు మిక్స్డ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. అయితే అందరూ చెప్తున్న కామన్ పాయింట్స్.. “ఇంటర్వెల్ అదిరిపోయింది, అడవి శేష్ యాక్టింగ్ పీక్స్, ‘హిట్ 2’ కన్నా ‘హిట్ 1’ బాగుంది, శైలేష్ కొలను మేకింగ్ బాగుంది, ‘హిట్ 3’ అనౌన్స్మెంట్ విజిల్స్ వేయించేలా ఉంది”. ఓవరాల్ గా ‘హిట్ 2’ సినిమా అబోవ్ యావరేజ్ రివ్యూస్ అయితే రాబడుతోంది మరి మార్నింగ్ షోస్ అన్ని ఏరియాల్లో కంప్లీట్ అయితే అప్పుడు కామన్ ఆడియన్స్ మౌత్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.