నటి సురేఖావాణి గురించి సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఇక బయట మాత్రం కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత వీడియోలు చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని ఇద్దరూ తల్లీకూతుళ్లా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారు. ఇప్పటికే చాలాసార్లు ఈ తల్లీకూతుళ్లపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ముఖ్యం గా సురేఖా వాణి డ్రెస్సింగ్ పై పలు విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా సురేఖ వాణి చేసిన ఓ వీడియోపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ మీకు ఇది అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే.. సరైనోడు చిత్రంలోని తెలుసా తెలుసా సాంగ్ కు సురేఖా రీల్స్ చేసింది.
లిరిక్స్ కు తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ ఉయ్యాల్లో కూర్చొని తెగ సిగ్గుపడుతూ కనిపించింది. దీంతో ట్రోలర్స్ మరోసారి రెచ్చిపోయారు. మీ వయసేంటి.. మీరు చేసే పనులు ఏంటి అని కొందరు.. ‘ఆంటీ అవసరమా ఈ సాంగ్స్ మీకు’, ‘ఈ ఏజ్‌లో మీకు ఆ సాంగ్ అవసరమా సురేఖ గారు’, ‘సురేఖ మేడమ్ మీ అమ్మాయి పెళ్లయ్యేదాకా కొంచెం ఇటువంటివి తగ్గించండి. లేదంటే మీ అమ్మాయిని చూసుకోడానికి వచ్చేవాడు మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే చేసుకుంటాడు అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక రెండేళ్ల క్రితం సురేఖ భర్త అనారోగ్యంతో మృతి చెందిన విషయం విదితమే.. ఆ తరువాత సురేఖ రెండో పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చినా వాటిని ఆమె ఖండించింది. తనకు తన కూతురు ఉంటే చాలని, ఏదైనా అలాంటి సంఘటనే జరిగితే తానే అందరికి చెప్తానని చెప్పుకొచ్చింది.