Sharanya: ఏ రంగంలోనైనా విజయం అందాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపికతోనే ఎంతోమంది నటులు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంటున్నారు. అలా ఒక్క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నవారిలో శరణ్య కూడా చేరింది. అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో నటి శరణ్య నటన కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో శరణ్య పేరు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. శరణ్య.. తెలంగాణ అమ్మాయి. న్యూస్ రీడర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. ఫిదా సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.. పిల్లా రేణుకగా సాయి పల్లవి అక్క పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత శరణ్యకు అవకాశాలు అయితే వచ్చాయి కానీ, అంతగా గుర్తింపు మాత్రం దక్కలేదు. అయినా కూడా శరణ్య మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతోంది. ఇక ఈ మధ్యనే రిలీజ్ అయిన అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రం ఆమెకు స్టార్ స్టేటస్ ను అందుకునేలా చేసింది.
సుహాస్, శివాని జంటగా దుష్యంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. సుహాస్ అక్కగా శరణ్య పాత్ర సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇందులో ఆమె ధైర్యం చేసి నగ్నంగా కూడా నటించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ నగ్న సన్నివేశాల గురించి మాట్లాడింది. ” కథ చెప్పినప్పుడే డైరెక్టర్ .. ఈ నగ్న సన్నివేశం గురించి చెప్పారు. మొదట నేను చేయడానికి భయపడ్డాను. కానీ, నా భర్త ప్రోత్సాహం వలనే నేను నగ్నంగా నటించాను. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అది.. ధైర్యంగా నటించు అని నా భర్త చెప్పడంతో నేను నటించగలిగాను. ఆ సన్నివేశం చేసేటప్పుడు సెట్ లో ఐదుగురు మాత్రమే ఉన్నారు. డీవోపీ, డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్, అసిస్టెంట్స్, మరో వ్యక్తి.. చాలా కంఫర్టబుల్‌గా నటించాను” అని చెప్పింది. ఈ సినిమా తరువాత శరణ్యకు మంచి మంచి పాత్రలు రావడం ఖాయమని చెప్పొచ్చు. మరి శరణ్య ముందు ముందు ఎలాంటి సినిమాల్లో నటిస్తుందో చూడాలి.