Actress Samyuktha Launches ‘Adishakti’ for Women’s Empowerment: మలయాళం నటి సంయుక్త మీనన్ ప్రస్తుతానికి తమిళం, మలయాళం, తెలుగు అని తేడా లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు పిలుపు వచ్చింది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె మీద ప్రశంసలు కురిపిస్తోంది. నిస్సహాయులైన మహిళలకు అండగా ఉండేందుకు సంయుక్త ముందుకు వచ్చింది. సమాజంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆదిశక్తి అనే ఒక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
Samantha: వరుణ్ ధావన్ టీనేజరన్న సమంత.. వరుణ్ హాట్ రిప్లై!
ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆమె ప్రకటించింది. పురుషులతో సమానంగా మహిళలకు కూడా అవకాశాలు కల్పిస్తే, వారు కూడా అభివృద్ధి పదంలో నడుస్తారని, వారిని అలా అభివృద్ధి పధంలో నడపాలని లక్ష్యంతో ఈ ఆదిశక్తి సంస్థను స్థాపించానని సంయుక్త చెబుతోంది. సమాజంలో ఉన్న అన్ని వయసుల మహిళలకు ఈ సంస్థ ద్వారా చేయూతనిస్తామని, విద్యా, ఉపాధి, శిక్షణ ఆరోగ్యం వంటి విషయాలలో మహిళలకు సపోర్టుగా నిలుస్తామని చెబుతున్నారు. మహిళలు సైతం ఆత్మగౌరవంతో జీవించాలని, అన్ని రంగాల్లో తమ గొంతు వినిపించాలనేది తమ ఆదిశక్తి సంస్థ ఉద్దేశం అని సంయుక్త ఒక ప్రకటనలో పేర్కొంది.