ఈ జనరేషన్స్ లో ‘సూపర్ స్టార్’ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్ ‘సమంతా’. హీరోల పక్కన నటించే దగ్గర నుంచి హీరో అవసరం లేకుండా తనే సినిమాని ముందుకి నడిపించే వరకూ కెరీర్ బిల్డ్ చేసుకున్న సమంతా గత కొంతకాలంగా ‘మయోసైటస్’తో బాధపడుతూ ఉంది. అనారోగ్యం కారణంగా సమంతా పబ్లిక్ అప్పిరెన్స్ ని పూర్తిగా అవాయిడ్ చేసింది.
గత కొన్ని నెలలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ అజ్ఞాతంలో ఉన్న సమంతా హైదరాబాద్ లో జరిగిన ‘శాకుంతలం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ గ్రాండ్ గా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కనిపించిన సామ్, చాలా ఎమోషనల్ అయ్యింది. ఎప్పుడూ జోవియల్ గా ఉండే సమంతా, తన అభిమానులని ఉద్దేశించి మాట్లాడింది. ఎంతో గొప్పగా సినిమాని తెరకెక్కించిన గుణశేఖర్ ని ఆడియన్స్ ఎలా అభినందిస్తారో చూడడానికే తను ట్రైలర్ లాంచ్ కి వచ్చాను అని సమంతా చెప్పింది. శక్తినంతా కూడదీసుకొని దర్శకుడి కోసం, అభిమానుల ప్రేమ కోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వచ్చాను అని చెప్పగానే ఆడిటోరియం అంతా అరుపులతో మోతమొగిపోయింది.
ఈ ట్రైలర్ లాంచ్ లో గుణశేఖర్ మైక్ తీసుకోని మాట్లాడుతూ ఉండగా సమంతా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంది. శాకుంతలం సినిమాని మెయిన్ హీరో సమంతానే, మూడున్నర సంవత్సరాలు పాటు ఎంతో కష్టపడి ఈ సినిమాని రూపొందించాం అని గుణశేఖర్ చెప్తుండగానే సమంతా ఏడ్చేసింది. ఈ సమయంలో ఆడిటోరియంలో ఉన్న ఫాన్స్ అంతా సమంతాకి అండగా నిలుస్తూ స్లొగన్స్ ఇచ్చారు. సామ్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకోని కాస్త రిలాక్స్ అయ్యింది. సామ్ పైకి ఎంత బాగా కనిపిస్తున్నా, ఆమె పెయిన్ అందరికీ అర్ధం అవుతోంది. సమంతా వీలైనంత త్వరగా కంప్లీట్ గా రికవర్ అవ్వాలని కోరుకుందాం.