పూనమ్ కౌర్ బీజేపీలో చేరనుందా ? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్స్ చూస్తుంటే ఇదే డౌట్ వస్తోంది అందరికీ. ఈటెలతో పూనమ్ మీటింగ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. నిన్న గురు నానక్ జయంతి సందర్భంగా హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెలను పూనమ్ కలిసి, ఏక్ ఓంకార్ ఫొటోను ఈటెల దంపతులకు అందజేశారు.
Read Also : “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?
అనంతరం “అంకిత భావం, చిత్తశుద్ధి, కరుణ గల ప్రజలను బాబా నానక్ ఎల్లప్పుడూ దీవిస్తారు. బాబా నానక్ ను నేనెప్పుడూ చూడలేదు. కానీ కష్టం వచ్చిన ప్రతిసారీ ఆయన ఉన్నారన్న నా నమ్మకం బలపడింది. ధర్మ యుద్దం ఎప్పుడూ గెలుస్తుంది” అంటూ హుజురాబాద్ లో ఈటెల గెలుపుపై స్పందించింది. అంతేకాకుండా రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి చేసిన ప్రకటనపై మాట్లాడుతూ మళ్లీ స్వేచ్చ, స్వతంత్ర్యం వచ్చినట్టు అనిపించింది. శాంతికి చిహ్నమైన పావురాలను స్వేచ్ఛగా వదిలేద్దామని చెప్పుకొచ్చింది. ఈ మేరకు తెల్లటి దుస్తుల్లో కన్పించిన పూనమ్ ఈటెలను కలవడం సంచలనంగా మారింది. తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో విభేదాల కారణంగా బయటకు వచ్చి, బీజేపీలో చేరి, ఇటీవల హోరాహోరీగా జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల విజయపతాకం ఎగరేసిన విషయం తెలిసిందే.