“ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్… ఎప్పుడంటే ?

“ఎవరు మీలో కోటేశ్వరులు” మొదటి సీజన్ త్వరలో పూర్తి కానుంది. ఇందులోని స్పెషల్ ఎపిసోడ్స్ కు తప్ప ఇప్పటి వరకూ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ షోకు సంబంధించిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేశారు. షో టిఆర్పి రేటింగ్స్ ను పెంచడానికి ఎలాంటి అవకాశాన్నీ వదిలి పెట్టడం లేదు మేకర్స్. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలను రంగంలోకి దింపిన “ఎవరు మీలో కోటేశ్వరులు” మేకర్స్ త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా, ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన సూపర్ ఎపిసోడ్ ను ప్రసారం చేయబోతున్నారు.

Read also : ధనుష్ ఫ్యాన్స్ డిమాండ్… ట్రెండింగ్ లో ‘నాన్ వరువేన్’

త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. మహేష్, ఎన్టీఆర్ ఇద్దరూ ఫ్రేమ్‌లో అద్భుతంగా కన్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహేష్, ఎన్టీఆర్ మధ్య చాలా సరదా సంభాషణ జరిగినట్టు సమాచారం. మహేష్ బాబు ఈ స్పెషల్ ఎపిసోడ్‌లో 25 లక్షలు గెలుచుకున్నట్టు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్‌లో ఆదివారం (సెప్టెంబర్ 19) ఎపిసోడ్‌ని షూట్ చేసారు. మేకర్స్ ఈ స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేయగానే “ఎవరు మీలో కోటేశ్వరులు” పూనకాల ఎపిసోడ్ లోడింగ్ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ ఎన్టీఆర్, మహేష్ కాంబినేషన్ లో వచ్చే స్పెషల్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో దీనిని బట్టి అర్థం అవుతోంది.

Related Articles

Latest Articles