Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె ఇష్టం. ఎలా కనిపించాలో ఆమె నిర్ణయం తీసుకుంటుంది. మధ్యలో నువ్వు ఎవరు చెప్పడానికి. కావాలని జూమ్ చేసి ఇలాంటి పోస్టు పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఫైర్ అయింది.
Read Also : Ananya Pande : హెడ్ లైట్స్ బాలేవంటూ ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్..
సీనియర్ హీరోయిన్ కాజోల్ నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ది ట్రయల్ రెండో సీజన్. ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఆమె బ్లాక్ స్కర్ట్ డ్రెస్లో హాజరయింది. ఇందులో ఆమె బాడీ కనిపించడంపై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఈ ఏజ్ లో ఇలాంటి డ్రెస్ లు అవసరమా అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. ఇంకొందరు మాత్రం ఆమె ఫిట్ నెస్ మీద కామెంట్లు చేస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్లు చేయడంతో ఈ పోస్టులు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారిపోయాయి. ఈ ట్రోల్స్ గురించి కాజోల్ ఇప్పటి వరకు స్పందించలేదు. మరి త్వరలో ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.
Read Also : Saipallavi : శ్రీలీల, కృతిశెట్టి, భాగ్య శ్రీ.. సాయిపల్లవిని చూసి నేర్చుకోండి..