CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan on CEC Appointment: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) నియామక విధానంలో సంస్కరణలు తీసుకురావాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల కమిషనర్‌ను అధికారంలో ఉన్న పార్టీలు ఎంపిక చేసే విధానం మారాలన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీని ఎంపిక చేసే విధానం ఉండాలని సూచించారు. వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెరగాలంటే నియామకాలు నిర్దేశిత విధానం ప్రకారం జరగాలని జగన్ పేర్కొన్నారు.
గతంలో సీఈసీ ప్రతిపాదనకు తాము ఒప్పుకోవడం తప్పే అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. గతంలో సీఈసీ నియామకానికి సంబంధించిన విధానానికి తాము మద్దతు ఇచ్చామని, అయితే ఇప్పుడు ఆ మద్దతును ఉపసంహరించుకున్నామని తెలిపారు. తప్పు జరిగిన తర్వాతే తాము కూడా ఈ అంశాన్ని గుర్తించామన్నారు. అందుకే నియామక ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని కోరుతున్నట్లు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక విధానంలోనూ సంస్కరణలు అవసరమని జగన్ అభిప్రాయపడ్డారు.
Also Read
- General Syed Amar Raza: "పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం".. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి ఎంపిక చేసే విధానం ఉండాలని మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. ఎన్నికల నిర్వహణలో కీలక పాత్ర పోషించే కమిషనర్ల నియామకాలు ఒక నిర్దిష్టమైన, పారదర్శకమైన వ్యవస్థ ప్రకారం జరగాలని పేర్కొన్నారు. ఇలాంటి మార్పుల ద్వారానే ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజావార్తలు
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
-
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!