Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Vamsi: సూపర్ స్టార్ రజినీకాంత్ – డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్‌తో దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘కూలీ’ సినిమా రేంజ్లో భారీ రిస్క్ చేసి ‘జైలర్ 2’ను ఎందుకు కొనాల్సి వచ్చిందో నాగవంశీ తాజాగా ప్రెస్మీట్లో వెల్లడించిన అసలు కారణం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రెస్మీట్లో నాగవంశీ మాట్లాడుతూ.. గతంలో రజినీకాంత్ ‘కూలీ’ సినిమాను రూ. 42 నుంచి రూ. 43 కోట్ల రేటుకు కొన్నారని, తాను కూడా అదే రేంజ్ హై-రేటు పెట్టి ‘జైలర్ 2’ తెలుగు రైట్స్‌ను కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. “అంత భారీ రేటు పెట్టినప్పుడు కచ్చితంగా రిస్క్ ఉంటుంది, అది నాకూ తెలుసు. కానీ నేను ఆ రిస్క్ చేయడానికి ప్రధాన కారణం డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్” అని అసలు విషయం చెప్పుకొచ్చారు.
నెల్సన్‌ను తెలుగులో సినిమా చేయమని తానే స్వయంగా అడిగానని నాగవంశీ వెల్లడించారు. “నెల్సన్ ఇప్పుడు రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి పెద్ద స్టార్లతో ప్రాజెక్టులు పూర్తి చేసుకున్న తర్వాత, సమీప భవిష్యత్తులో తెలుగులో సినిమా చేస్తే అది కచ్చితంగా నా బ్యానర్లోనే చేస్తారు. రేపు నా దగ్గర పనిచేయబోయే దర్శకుడి సినిమా ఇప్పుడు మార్కెట్లోకి వస్తున్నప్పుడు.. ఆ డైరెక్టర్‌ను నమ్మి ఈ మాత్రం రిస్క్ తీసుకోలేమా అన్న ఆలోచనతోనే ముందుకు వెళ్లాను” అని నాగవంశీ వివరించారు. జైలర్ 1 కొనుగోలుదారులు ఎందుకు వెనకడుగు వేశారో తనకు తెలియదని, తన డెసిషన్ మాత్రం పూర్తిగా నెల్సన్ మీద ఉన్న నమ్మకమేనని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మంచి వసూళ్లతో సేఫ్ జోన్లోకి వెళ్తున్న ‘జైలర్ 2’ విజయం ఒక ఎత్తయితే.. భవిష్యత్తులో నెల్సన్ దిలీప్‌కుమార్‌ను టాలీవుడ్‌కు తీసుకురావడానికే నాగవంశీ ఇంతటి ముందస్తు వ్యూహం రచించారన్న వార్త సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Also Read
- Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
- Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
- Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
- Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్‌తో మొదలైన రచ్చ!
తాజావార్తలు
-
Naga Vamsi: ‘జైలర్ 2 హై రేట్ పెట్టి ఎందుకు కొన్నానంటే’.. అసలు నిజం చెప్పిన నాగవంశీ!
-
Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
-
Pawan Kalyan Meets Mohan Yadav: పవన్ కళ్యాణ్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక చర్చలు
-
Director Balraj Kalarickal: 28 ఏళ్లకే దర్శకుడు బాలరాజ్ కలరికల్ కన్నుమూత.. ‘కప్పి స్క్వాడ్’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!