General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
General Syed Amar Raza: పాకిస్థాన్ మరోసారి అణు హెచ్చరికలతో తెరపైకి వచ్చింది. దేశ భద్రత విషయంలో శత్రువులు ఎలాంటి తప్పుడు అంచనాలకు పోవద్దని, ఒకవేళ పొరపాటున దురాక్రమణకు దిగితే ఊహకందని రీతిలో ప్రతీకారం ఉంటుందని పాకిస్థాన్ నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ కమాండర్ జనరల్ సయ్యద్ ఆమర్ రజా తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాకుల్‌లోని పాకిస్థాన్ మిలటరీ అకాడమీ (పీఎంఏ)లో జరిగిన పాసింగ్ అవుట్ పరేడ్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదని, అయితే తమ దేశంపై దుష్ట ఉద్దేశాలు పెట్టుకునేవారికి మాత్రం తమ వైఖరి చాలా కఠినంగా ఉంటుందని తేల్చిచెప్పారు. అణు వాతావరణంలో యుద్ధాలకు ఎలాంటి తావులేదని, శత్రువులు చేసే చిన్న పొరపాటు కూడా వాళ్ల ఊహకు అందని స్థాయి ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుందని జనరల్ రజా హెచ్చరించారు. దేశ సార్వభౌమాత్వాన్ని కాపాడుకోవడానికి, దేశంలోని ప్రతి అంగుళాన్ని రక్షించడానికి తమ సాయుధ బలగాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ప్రాంతీయ భద్రత గురించి మాట్లాడుతూ.. సరిహద్దు దాటి జరిగే చొరబాట్లను ఏ పరిస్థితుల్లోనూ సహించేది లేదని జనరల్ రజా స్పష్టం చేశారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తన పాత వైఖరినే మరోసారి గట్టిగా వినిపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ) తీర్మానాల ఆధారంగానే పరిష్కారం కావాల్సిన అంతర్జాతీయ వివాదంగా కశ్మీర్ మిగిలిపోయిందని ఆయన పునరుద్ఘాటించారు. మరోవైపు, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు చేసిందని, ప్రపంచ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల వేళ పాకిస్థాన్ సానుకూల పాత్ర పోషించిందని అంతర్జాతీయ సమాజం చూసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పాలస్తీనాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు వెంటనే నిలిచిపోవాలని ఆయన డిమాండ్ చేశారు. చివరగా, ప్రసంగం ముగింపులో కొత్తగా కమిషన్ అయిన అధికారులకు దేశ భద్రత, గౌరవ రక్షణ విషయంలో వారిపై ఉన్న భారీ బాధ్యతను జనరల్ రజా గుర్తుచేశారు. ఆపరేషనల్ రంగాలన్నింటిలోనూ తమ సత్తా చాటుతున్న సాయుధ బలగాలకు నిజాయితీ, ధైర్యం, సాహసమే మూలస్తంభాలన్నారు.
Also Read
- Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
- Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
- Spirit Release Date Announced: ప్రభాస్' రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
- Jammalamadugu-YCP: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. ఇందిరమ్మ నామినేషన్‌పై ఉత్కంఠ!
తాజావార్తలు
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
-
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
-
Spirit Release Date Announced: ప్రభాస్’ రిలీజ్ డేట్ అఫీషియల్.. దీపావళికే సందీప్ వంగా మూవీ.. కానీ..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!