Actress Meena: భర్త చనిపోయాక మీనా సంచలన నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Meena Took Sensational Decision After Husband Vidya Sagar Demise: ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ కొన్ని రోజుల క్రితమే అనారోగ్యం కారణంగా మృతి చెందిన విషయం విదితమే! ఇన్నాళ్లూ ఆ విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. సినిమా షూటింగుల్లోనూ పాల్గొంటోంది. ఇప్పుడు తాజాగా ఆమె ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా.. తన అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రాణాల్ని కాపాడ్డానికి మించిన గొప్ప పని మరొకటి ఉండదని చెప్పిన ఆమె.. మీరు కూడా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకోండని కోరుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
‘‘ప్రాణాలను కాపాడ్డానికి మించిన గొప్ప పని మరొకటి ఉండదు. ప్రాణాల్ని కాపాడే గొప్ప మార్గాల్లో.. అవయవ దానం చేయడం ఒకటి. అనారోగ్యంతో బాధపడే వారికి అవయవాలు దానం చేస్తే, అది వారికి రెండో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. నేను వ్యక్తిగతంగా ఆ బాధల్ని ఎదుర్కొన్నదాన్నే! నా సాగర్‌కి కూడా అవయవాలు దానం చేసేవాళ్లు దొరికి ఉండుంటే, ఇప్పుడు పరిస్థితులు మరోలా ఉండేవి. నా జీవితం పూర్తిగా మారిపోయేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడగలుగుతాడు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతిఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు. ఇది కుటుంబం, స్నేహితులు, సహోద్యుగులపై గొప్ప ప్రభావం చూపుతుంది’’ అంటూ మీనా చెప్పుకొచ్చింది.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
చివరగా తానూ తన అవయవాల్ని దానం చేయాలని ప్రతిజ్ఞ తీసుకుంటున్నానని, మన లెగసీని ముందుకు కొనసాగించడానికి ఇదే అత్యుత్తమమైన మార్గమని మీనా వెల్లడించింది. మీనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక.. భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణమేనని అర్థమవుతోంది. మీనా భర్త చనిపోయింది ఊపిరితిత్తుల సమస్యతో! ఒకవేళ వాటిని మార్చి ఉండుంటే, ఆయన కచ్ఛితంగా బ్రతికేవాడు. కానీ.. ఆ సమయానికి దాతలు దొరక్కపోవడం వల్ల ఆయన మృతి చెందారు. భర్త మరణంతో ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఇతర కుటుంబాల్లో ఇలాంటి విషాద సంఘటనలు చోటు చేసేకోకూడదనే.. అవయవ దానం చేసేందుకు మీనా ముందుకొచ్చింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?