Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: ఒక్క ఏడాది వ్యవధిలోనే ఏకంగా రూ.2,490 కోట్ల లాస్ అంటే ఏ కార్పొరేట్ దిగ్గజానికైనా గుండె గుభిల్లుమంటుంది. కానీ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రేంజ్ వేరు. తన ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని కుదుపునకు లోనైనా, దేశంలోనే నంబర్ వన్ రిచ్ యాక్టర్‌గా తనపేరు మీదన్న రికార్డును మాత్రం చేంజ్ కాలేదు. ఎంతలా అంటే.. తన సంపదలో ఇంత పెద్ద లాస్ వచ్చిన తర్వాత కూడా, రెండో స్థానంలో ఉన్న అమితాబ్ బచ్చన్ ఆస్తి కంటే షారుఖ్ నికర విలువ ఇంకా రెట్టింపు కంటే ఎక్కువే ఉండటం విశేషం. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ తాజా లెక్కల ప్రకారం షారుఖ్ ఖాన్ నికర సంపదలో తీవ్ర క్షీణత కనిపించింది. గతేడాది ఏకంగా రూ.12,490 కోట్లుగా నమోదైన ఆయన ఆస్తుల విలువ, ఈ ఏడాదికి వచ్చేసరికి రూ.10,000 కోట్లకు పడిపోయింది.
అంటే వన్ ఇయర్లోనే రూ.2,490 కోట్లు ఆవిరైపోయాయి. షారుఖ్ కేవలం సినిమాలపైనే కాకుండా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, కోల్‌కతా నైట్ రైడర్స్ వంటి బడా స్పోర్ట్స్ వెంచర్లలో విస్తృత పెట్టుబడులు పెట్టారు. మార్కెట్ ఒడిదుడుకులు, వ్యాపార భాగస్వామ్యాల విలువల మార్పుల వల్లనే ఈ మేర సంపద తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. సంపద భారీగా కరిగిపోయినా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో షారుఖ్ దరిదాపుల్లోకి ఏ ఇతర నటుడూ లేరు. ప్రస్తుతం రూ.10,000 కోట్లతో షారుఖ్ టాప్‌లో కొనసాగుతుండగా.. రూ.4,000 కోట్లతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో, రూ.3,000 కోట్లతో సల్మాన్ ఖాన్ మూడో స్థానంలో, రూ.2,500 కోట్లతో హృతిక్ రోషన్ నాలుగో స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న అమితాబ్ కంటే షారుఖ్ ఆస్తులు ఇంకా రెండున్నర రెట్లు ఎక్కువగానే ఉన్నాయి.
Also Read
- Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
- Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
- Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
- Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ 'లవ్ అండ్ వార్' ఫస్ట్ లుక్ రిలీజ్
తాజావార్తలు
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
-
UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!