TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRAI New Rules: స్మార్ట్ఫోన్లు చేతిలో లేకున్నా.. ఇంటర్నెట్తో అసలు పనే లేకున్నా.. ప్రతినెలా నెట్ ప్యాక్ కోసం వందల రూపాయలు దారపోయాల్సి వస్తోందా? మీ ఇంట్లోని వృద్ధులు, పల్లెల్లో ఉండే సాధారణ ప్రజలు ఫీచర్ ఫోన్లు వాడుతూ ఖరీదైన రీఛార్జ్ భారాన్ని భరిస్తున్నారా? అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్. టెలికాం ఆపరేటర్ల దశాబ్దాల దోపిడీకి చెక్ పెడుతూ భారత టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్స్‌పై బలవంతంగా డేటాను రుద్దడం కుదరదని స్పష్టం చేసింది. జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి అగ్రశ్రేణి కంపెనీలకు షాక్ ఇస్తూ.. అక్టోబర్ 21 నుంచి కేవలం ‘వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్’లతో కూడిన చౌకైన రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తేవాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
కచ్చితమైన నెలవారీ సైకిల్.. ఆ తేదీకే రెన్యూవల్
ప్రస్తుతం టెలికాం కంపెనీలు అందిస్తున్న 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ గల రెగ్యులర్ డేటా ప్లాన్లతో సమానంగా, డేటా లేని కాలింగ్ ప్లాన్లను సైతం మార్కెట్లోకి తేవాల్సిందేనని ట్రాయ్ ఆదేశించింది. వీటితో పాటు కనీసం ఒక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టాలని అంది. వీటన్నింటిలో వినియోగదారులకు లభించే అతిపెద్ద ఉపశమనం వ్యాలిడిటీ టైం. ప్రతినెలా ఒకే తేదీన ప్లాన్ రెన్యూ అయ్యేలా ఈ సరికొత్త ప్లాన్లు ఉండనున్నాయి. ఉదాహరణకు ఒక నెలలో 10వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే, మరుసటి నెలలో కూడా 10వ తేదీ వరకే ఆ ప్యాక్ వర్తిస్తుంది. 31వ తేదీ లేని నెలల్లో ఆ నెల చివరి రోజే గడువు ముగుస్తుంది. దీంతో పరోక్షంగా కంపెనీలు చేస్తున్న రోజుల కోతకు తెరపడనుంది.
Also Read
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- UPI: పెట్రోల్ బంకులకు ఊరట.. UPI ఛార్జీలపై కేంద్రం కీలక నిర్ణయం!
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
ధరలు ఎంత మేర తగ్గుతాయంటే..
నో డేటా రీఛార్జ్ ప్యాక్ ధరల్లో గణనీయమైన తగ్గింపు ఉండాలని ట్రాయ్ తేల్చిచెప్పింది. కంపెనీలు తమ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ప్రాతిపదికన ధరలను నిర్ధారించాలని సూచించింది. గణాంకాల ప్రకారం.. ఒకప్పుడు జీబీ డేటాపై కంపెనీలకు సగటున రూ. 9.11 వచ్చేది, ప్రస్తుతానికది రూ. 7.51కి తగ్గింది. అయినప్పటికీ వినియోగదారులు ఎక్కువగా ఇంటర్నెట్ వాడుతుండటంతో సగటు బిల్లు రూ.183 నుంచి రూ.196.04కి పెరిగింది. ఇప్పుడు డేటా రహిత ప్లాన్లు అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ వాడని సాధారణ వర్గాల నెలవారీ ఖర్చు భారీగా ఆదా కానుంది. గతంలో డిసెంబర్ 2024లోనే కేవలం కాలింగ్ ఉండే 365 రోజుల వోచర్లను తేవాలని ట్రాయ్ చెప్పినప్పటికీ, టెలికాం సంస్థలు చిట్కాలు ప్రయోగించాయి. తక్కువ వ్యాలిడిటీ ప్లాన్లను పక్కనపెట్టి, ఎక్కువ ధరలతో కూడిన ప్యాక్స్ మాత్రమే ఇచ్చాయి. దీనిపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఏప్రిల్ 2026లో డ్రాఫ్ట్ రూపొందించి, జూన్ 15న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాతే ట్రాయ్ ఈ సరికొత్త నిబంధనలను ఖరారు చేసింది. కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. ప్రజల ప్రయోజనాలే పరమావధిగా అక్టోబర్ 21 నుంచి ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ట్రాయ్ ఆదేశించింది.
తాజావార్తలు
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!