Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద విద్యార్థులు దేశీయ విమాన టికెట్ ధరలపై 10 శాతం డిస్కౌంట్‌తో పాటు, అదనపు లగేజ్ సదుపాయం మరియు తక్కువ ధరకు డేట్ మార్చుకునే వెసులుబాటును పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 20, 2026 వరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక బుకింగ్ ఛానెళ్ల ద్వారా అందుబాటులో ఉంటుంది.
ఈ ప్రత్యేక ఆఫర్ కింద విద్యార్థులకు దేశీయ వాల్యూ ఫేర్లపై 10 శాతం తగ్గింపు లభిస్తుంది. సాధారణంగా ఉండే 15 కిలోల లగేజ్ కు బదులుగా విద్యార్థులు ఏకంగా 25 కిలోల వరకు లగేజ్‌ను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. అంటే ఇందులో అదనంగా 10 కిలోల లగేజ్ వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులు కేవలం రూ. 99 చెల్లించి తమ ప్రయాణ తేదీని మార్చుకోవచ్చు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ బుక్ చేసుకునే కస్టమర్లు ‘VIBES’ కోడ్‌ను ఉపయోగించి అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చని ఎయిర్ లైన్స్ తెలిపింది. అయితే ఇందుకు కొన్ని నియమ నిబంధనలు వర్తిస్తాయి.
Also Read
- Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
ఈ విద్యార్థి ఆఫర్‌ను పొందడానికి విద్యార్థులు కనీసం 12 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ప్రయాణ సమయంలో గుర్తింపు పొందిన విద్యా సంస్థ జారీ చేసిన సరైన స్టూడెంట్ ఫోటో ఐడీ కార్డ్‌ను విధిగా కలిగి ఉండాలి. ఈ ఐడీ కార్డ్‌పై విద్యార్థి పేరు , పుట్టిన తేదీ స్పష్టంగా ఉండాలి. ఎయిర్‌పోర్టులో చెక్-ఇన్ చేసే సమయంలో ఈ ఐడీ కార్డ్‌ను చూపించాల్సి ఉంటుంది.
విద్యార్థుల ఆఫర్‌తో పాటు.. అర్హత కలిగిన వీసా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఉపయోగించి చేసే దేశీయ, అంతర్జాతీయ విమాన బుకింగ్‌లపై రూ. 600 వరకు తగ్గింపును కూడా ఎయిర్‌లైన్స్ అందిస్తోంది. కస్టమర్లు ఈ ఆఫర్ కోసం ‘VISAFLY’ కోడ్‌ను ఉపయోగించవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 9, 2026 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ 500కి పైగా విమానాలను నడుపుతూ, 48 దేశీయ , 16 అంతర్జాతీయ గమ్యస్థానాలను కలుపుతోంది. ఈ ఎయిర్‌లైన్స్ విమాన కాఫ్ట్లో 100కి పైగా బోయింగ్ 737, ఎయిర్‌బస్ A320 విమానాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు తగ్గించేందుకు ఈ ప్రత్యేక ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!