టాలీవుడ్ నటి కరాటే కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో అనుకున్నది నిక్కచ్చిగా చెప్తూ వివాదాలలో చిక్కుకోవడం ఆమెకు కొత్తకాదు. అయితే ఆమె జీవితం అందరికి తెలిసిన పుస్తకమే.. రెండు పెళ్లిళ్లు.. అర్ధం చేసుకొని భర్తలు.. విడిపోవడం.. పిల్లల కోసం ఆమె పడుతున్న తపన ఇవన్నీ బిగ్ బాస్ సమయంలో ఆమె చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లిళ్లు గురించి, పిల్లల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ” నేను ఏంటి అనేది మీ అందరికి బాగా తెలుసు.. భార్య అంటే వంటింటికి మాత్రమే పనికొచ్చేది కాదు. నేను అందరిలాంటి ఆడపిల్లను కాదు. నేను నిప్పు.. నిప్పును ఎవరైనా ఎంతసేపు పట్టుకోగలరు. అందుకే నా వివాహ జీవితం మధ్యలోనే ఆగిపోయింది. వాళ్ళు వదిలి వెళ్లడంలో నా తప్పు లేదు.
నన్ను వాళ్లే అర్ధం చేసుకోలేదు. అందుకే ఆ గొడవల మధ్య విసిగిపోయి విడాకులు తీసుకున్నా.. ఇప్పుడు హ్యాపీగా సింగిల్ గా నివసిస్తున్నా.. అయితే ఇప్పటివరకు నాకు నిజమైన ప్రేమ దొరకలేదు. ప్రేమ, పెళ్లి అంటూ నన్ను వాడుకొని వదిలేశారు.
జీవితంలో నాకు నిజమైన ప్రేమ దొరికినప్పుడు నేను మూడో పెళ్ళికి సిద్ధం.. సరైనా అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే పెళ్లికి లేదా సహజీవనానికి కూడా రెడీ. పిల్లలే కోసం నేను రెండు సార్లు వివాహం చేసుకున్నాను. ఆ ఆశ ఇంకా తీరలేదు. జీవితంలో తీరాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కళ్యాణి మాటలు నెట్టింట వైరల్ గా మారాయి..