Kalpika Ganesh: టాలీవుడ్ నటి కల్పిక గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటికి మొన్న తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు స్టార్ కమెడియన్ అభినవ్ గోమటం తనను అవమానించాడంటూ చెప్పుకొచ్చి హల్చల్ చేసింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కల్పిక హాస్పిటల్ లో ఉన్నది. ఆమె గత కొన్నిరోజులుగా రాడిక్యులర్ పెయిన్ తో బాధపడుతుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నుముక వద్ద నొప్పి. దీనివలన ఎక్కువసేపు నిలబడినా.. కూర్చున్నా విపరీతమైన నొప్పి వస్తోంది. ఆ బాధను భరించలేక కల్పిక అందుకు సంబంధించిన సర్జరీని చేయించుకుంది.
లుంబార్ రాడిక్యులోపతి అనే సర్జరీ విజయవంతంగా జరిగిందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ” చివరికి అంతా సవ్యంగా జరిగింది.. నా పోరాటం చివరకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో చూడాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ విషయం తెల్సిన కొందరు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటుండగా.. వారితో వీరితో గొడవ పడకుండా చక్కగా వచ్చిన పాత్రలు చేసుకో అంటూ సలహాలు ఇస్తున్నారు.