Actress Hema Complaints On Youtube Channels For Circulating Fake News: సెలెబ్రిటీలపై అసత్య ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై నటి హేమ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడేళ్ల క్రితం వివాహ వార్షికోత్సవంలో.. తన భర్తతో ఉన్న ఫోటోలు, వీడియోను ఇప్పుడు మరోసారి పోస్ట్ చేసి.. ఫేక్ థంబ్‌నైల్స్ పెట్టి అసత్య ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ.. అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే.. కొందమంది సెలెబ్రిటీలు బతికే ఉన్నా, చనిపోయారంటూ చేస్తున్న దుష్ప్రచారంపై కూడా హేమ ఫిర్యాదు చేశారు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలపై తప్పుడు వార్తలు రాసి డబ్బులు సంపాదించుకుంటున్నాయని.. సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు బతికే ఉన్నా చనిపోయినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెలబ్రిటీలపై సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వేధింపులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏసీపీని కోరానని.. ఈ విషయంలో కోర్టుకు వెళ్లేందుకు కూడా తాను వెనుకాడనని హేమ తెలిపారు.
Naveen Case: నిహారికకు బెయిల్.. ఉరి తీయాలంటూ తల్లిదండ్రులు ఫైర్
కాగా.. ఇటీవల నటి హేమ తన భర్తతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఆడుకునే వీడియోను యూట్యూబ్ ఛానెల్స్ వాళ్లు బాగా సర్క్యులేట్ చేశారు. ఆ ఇద్దరు ముద్దాడుతున్నట్టు థంబ్‌నైల్స్ పెట్టి.. ప్రచారం చేశారు. ఇవి తన దృష్టికి రావడంతో కోపాద్రిక్తురాలైన హేమ.. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ హద్దు మీరి థంబ్‌నైల్స్ పెట్టినప్పుడు కూడా.. వాటిపై సెలెబ్రిటీలు ఫిర్యాదు చేయడం జరిగింది. మా సభ్యులు సైతం సీరియస్ అయి.. ఆయా ఛానెళ్లపై చర్యలు తీసుకున్న దాఖలాలున్నాయి. అయినప్పటికీ.. యూట్యూ్బ్ ఛానెల్స్ నిర్వహిస్తున్న వారిలో మార్పు రావడం లేదు.
Srinivas Goud: కిషన్ రెడ్డి బహిరంగంగా కవితకు క్షమాపణలు చెప్పాలి