Naveen Parents Reacts On Niharika Reddy Bail: అబ్దుల్లాపూర్‌మెట్ నవీన్ హత్య కేసులో A3 నిందితురాలిగా ఉన్న నిహారికకు బెయిల్ మంజూరు అవ్వడం, ఆమె చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అవ్వడం అందరికీ తెలిసిందే! అయితే.. నిహారికకు బెయిల్ ఇవ్వడంపై నవీన్ తల్లిదండ్రులు తప్పుపట్టారు. తమ కొడుకు, కుటుంబానికి చాలా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 23 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్న తమ కొడుకుని ఆ ముగ్గురు కలిసి అతి కిరాతకంగా చంపేశారని రోదించారు. కొడుకే పెద్ద దిక్కుగా ఇన్నాళ్లూ బతికామని, ఇప్పుడు తమకు ఎవరూ లేరని వాపోయారు. అన్నింటికీ నిహారిక రెడ్డినే కారణమని.. అలాంటిది ఆమెకు అంత త్వరగా బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చంపిన తర్వాత కూడా నిహారిక నిందితులకు ఆశ్రయమించి, సహకరించిందన్నారు. నీహారికకి వాళ్ల ఫ్యామిలీ, లాయర్లు, పోలీసులు బాగా సపోర్ట్ చేశారని.. ఈ కేసుని మళ్లీ దర్యాప్తు చేసి, నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న కేసులకు బెయిల్ దొరకడమే కష్టమని, అలాంటిది ఇంత పెద్ద కేసులో అంత త్వరగా బెయిల్ రావడం పట్ల తమకు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.
Malavika: నేను పవన్ సినిమాలో సెకండ్ లీడ్ కాదు… ప్రభాస్ సినిమాలో మెయిన్ లీడ్
కాగా.. ప్రేమ కోసం తన స్నేహితుడైన నవీన్‌ను హరిహరకృష్ణ అబ్దులాపూర్‌మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి, అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే! అతని ముక్కు, చెవులు, పెదాలు, తల, ప్రైవేట్ భాగాలను కోసేశాడు. హత్య చేసిన విషయాన్ని తన స్నేహితుడు హసన్‌కి, ప్రియురాలు నిహారికకు చెప్పాడు. ఆ ఇద్దరిని సంఘటనా స్థలానికి తీసుకెళ్లాడు. ఈ హత్య విషయం తెలిసినా.. నిహారిక, హసన్‌లు ఎవ్వరికీ చెప్పలేదు. పైగా.. బాడీ పార్ట్స్ కాల్చడంలో అతనికి సహకరించారు. హరికృష్ణ పారిపోవడానికి నిహారిక రూ.1500ల ఆర్థిక సహాయం కూడా అందించింది. ఇలా అతనికి ఈ హత్యలో మద్దతు ఇవ్వడంతో.. పోలీసులు హసన్‌ని ఏ2గా, నిహారికను ఏ3గా చేర్చారు. కోర్టు వీళ్లకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే.. ఇంతలోనే నిహారిక బెయిల్ కోసం అప్లై చేయగా, కోర్టు దాన్ని మంజూరు చేయడం, ఆమె జైలు నుంచి విడుదల అవ్వడం జరిగింది.
Crime News: దారుణం.. తరగతి గదిలోనే ఆరో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం