Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నిండింది. ఇదే ఘటనలో ఓ సెలబ్రిటీల జంట కూడా చిక్కుకుందనే ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రముఖ నటి దీపికా కాకర్, ఆమె భర్త షోయబ్ ఇబ్రహీం కలిసి పహల్గాం టూర్ కు వెళ్లారు. అక్కడ ఫొటోలు దిగుతూ సోషల్ మీడియాలో కూడా పోస్టు చేశారు. టెర్రర్ అటాక్ జరిగిన తర్వాత ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కూడా దాడిలో చిక్కుకున్నారేమో అంటూ పోస్టులు పెట్టారు. అయితే వాటిపై ఈ జంట స్పందించింది. తాము క్షేమంగానే ఉన్నామని తెలిపింది. మంగళవారం ఉదయమే తాము ఢిల్లీకి వచ్చామని తెలిపారు.
Read Also: Disha Patani : రెచ్చిపోయిన దిశా పటానీ.. ఆ ఫోజులు చూస్తే..
‘మీరు మా కోసం ఆందోళన చెందుతున్నారు. మీ అందరికీ థాంక్స్. మేం సేఫ్ గానే ఉన్నాం. దయచేసి ఎవరూ ఆందోళన చెందకండి. మేం క్షేమంగా ఢిల్లీలో ఉన్నాం’ అంటూ తెలిపారు. వీరిద్దరూ తమ కుమారుడితో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఫొటోలు, వీడియోలను ఇన్ స్టాలో పోస్టు చేశారు. అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపికా కాకర్ సీరియల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వత సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే వీరు పోస్టు చివరలో కొత్త వ్లాగ్ చేశామని.. అది త్వరలోనే వస్తుంది అంటూ చెప్పడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క దేశమంతా ఉగ్రదాడిపై ఆందోళన చెందుతుంటే.. ఇదేం పిచ్చి పని అంటూ తిట్టి పోస్తున్నారు.