Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. ఈ మధ్యనే అలియా ఒక పాపకు జన్మనిచ్చిన విషయం తెల్సిందే. ఆమె పేరు రేహా కపూర్. ఇక కూతురు రాకతో రణబీర్ ప్రపంచాన్ని మర్చిపోయాడు. షూటింగ్ లేకపోవడం ఆలస్యం తన గారాలపట్టీతో ఆడుకోవడానికి సిద్ధమవుతున్నాడు. మరోపక్క అలియా ప్రెగెన్సీ సమయంలో తన శరీరంలో వచ్చిన మార్పులు మార్చడానికి ప్రయత్నిస్తోంది. బొద్దుగా మారిన అలియా జిమ్, యోగా చేసి మునుపటి రూపానికి రావడానికి కష్టపడుతోంది.
ఇక తాజాగా అలియా బ్రెస్ట్ ఫీడింగ్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఎరుపు రంగు చీరలో బిడ్డకు పాలు ఇస్తూ నవ్వులు చిందిస్తున్నట్లు అలియా కనిపిస్తోంది. అందం పోతోంది, వయసు కనిపిస్తోంది అని సరోగసి ద్వారా బిడ్డలను కనకుండా సహజ పద్దతిలో బిడ్డను కనడమే కాకుండా మాతృత్వాన్ని పెంచే తల్లిపాలు ఇస్తున్నందుకు అలియాను అందరు ప్రశంసిస్తున్నారు. అయితే మరోపక్క ఈ ఫోటో ఎడిట్ చేసిందని, అందులో ఉన్నది అలియా కాదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.