Abhinaya : టాలీవుడ్ నటి అభినయ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. చాలా రోజుల కిందటే ఆమె పెళ్లి గురించి హింట్ ఇచ్చింది. కానీ ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. కానీ తాజాగా తనకు కాబోయే వరుడిని పరిచయం చేసింది. అతని పేరు సన్నీవర్మ అని తెలిపింది. అంతే కాకుండా మార్చి 9న వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు స్పష్టం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది. సన్నీ వర్మ ప్రస్తుతం హైదరాబాద్ లోనే మల్టీ నేషనల్ కన్ స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. గత 15 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు సమాచారం.
Read Also : NZ vs PAK 1st ODI: వన్డేలలో కూడా అదే పరిస్థితి.. పాక్‌పై న్యూజిలాండ్ గెలుపు
అభినయ టాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. పుట్టుకతోనే చెవిటి, మూగ అయినా తన అభినయంతో ఆకట్టుకుంది, కింగ్, నేనింతే, శంభో, శివ శంభో సినిమాలు చేసింది. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో చిన్ని పాత్రతో తనకు బాగా గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. కాగా ఆ మధ్య విశాల్ తో ఓ ఫొటో దిగడంతో.. వారిద్దరూ లవ్ లో ఉన్నారంటూ ప్రచారం చేశారు. కానీ వాటిని అభినయ ఖండించింది. ప్రస్తుతం తాను ప్రేమించిన వాడితోనే పెళ్లిపీటలు ఎక్కడానికి రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ.