Srikanth: వైవిధ్యమే శ్రీకాంత్ ఆయుధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆశలు ఉంటాయి అందరికీ… అవి నెరవేరేదికి కొందరికే…”- “ఊహలు వస్తాయి అందరికీ… అవి సాకారమయ్యేదీ కొందరికే…” – ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. కానీ, కార్యసాధకులు అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరనీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందరో ఆ మాటలకు అక్షరరూపం ఇచ్చినవారూ ఉన్నారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ తానూ ఉన్నానని నిరూపించుకున్నారు. మొన్నటి దాకా హీరోగా సాగిన శ్రీకాంత్, స్టార్ డమ్ తగ్గగానే కేరెక్టర్ రోల్స్ లోనూ, విలన్ గానూ నటిస్తున్నారు. బాలకృష్ణ ‘అఖండ’లో శ్రీకాంత్ విలన్ గా తన పాత్రను సమర్థవంతంగా పోషించారు. ఈ యేడాది కూడా ‘వారసుడు’, ‘హంట్’ సినిమాల్లో శ్రీకాంత్ వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. మునుముందు కూడా తన దరికి చేరిన పాత్రల్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీకాంత్.
ఇప్పుడంటే కేరెక్టర్ రోల్స్, విలన్ వేషాలు వేస్తున్నారు కానీ, ఒకప్పుడు శ్రీకాంత్ స్టార్ గా సాగిన వైనాన్ని సినీ ఫ్యాన్స్ ఎవరూ మరచిపోలేరు. ఓ మధ్యతరగతి కుటుంబంలో 1968 మార్చి 23న శ్రీకాంత్ జన్మించారు. కర్ణాటకలో స్థిరపడ్డ తెలుగువారు కావడంతో శ్రీకాంత్ విద్యాభ్యాసం అటు, ఇటు సాగింది. చదువుకొనే రోజుల్లో చిరంజీవి వీరాభిమాని శ్రీకాంత్. స్వయంకృషితో చిత్రసీమలో మెగాస్టార్ గా రాణించిన చిరంజీవిని ఆదర్శంగా తీసుకొని శ్రీకాంత్ సైతం నటనాభిలాషను పెంచుకున్నారు. సరైన అడుగులు వేస్తూ హైదరాబాద్ ‘మధు ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్’లో నటనా శిక్షణ తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్ కౌంటర్’ చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు శ్రీకాంత్. ఆరంభంలోనూ అందివచ్చిన పాత్రల్లో నటించారు శ్రీకాంత్. అలా నటునిగా గుర్తింపు సంపాదించిన శ్రీకాంత్ కు డి.రామానాయుడు నిర్మించిన ‘తాజ్ మహల్’ చిత్రం బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘పెళ్ళిసందడి’ సినిమా ఘనవిజయం శ్రీకాంత్ ను స్టార్ హీరోగా నిలిపింది. ఆ సినిమా అప్పట్లో 23 కేంద్రాలలో 4 ఆటలతో రజతోత్సవం జరుపుకుని ఓ రికార్డ్ సృష్టించింది. చిన్నసినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించిన ‘పెళ్ళిసందడి’ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది. ఆ తరువాత శ్రీకాంత్ హీరోగా రూపొందిన అనేక చిత్రాలు జైత్రయాత్ర సాగించాయి. అయితే ‘పెళ్ళిసందడి’ స్థాయి సక్సెస్ మళ్ళీ శ్రీకాంత్ కు దక్కలేదు.
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
తన ఊహలను నిజం చేసుకొని కథానాయకునిగా వెండితెరపై వెలిగిపోయిన శ్రీకాంత్, తన జీవితనాయికగా నటి ఊహను ఆహ్వానించారు. వారికి ఇద్దరు అబ్బాయిలు, ఓ పాప. అబ్బాయిల్లో రోషన్ కూడా తండ్రి బాటలో పయనిస్తూ నటనలో అడుగుపెట్టాడు. ‘నిర్మలా కాన్వెంట్’లో తొలిసారి నటించిన రోషన్ ఆ మధ్య ‘పెళ్ళిసందD’లో హీరోగా కనిపించాడు. రోషన్ ను స్టార్ గా చూడాలని శ్రీకాంత్ లోని తండ్రి మనసు ఆరాటపడుతోంది. ఇక తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలనీ శ్రీకాంత్ భావిస్తున్నారు. శ్రీకాంత్ తనదైన అభినయంతో అలరిస్తారని ఆశిద్దాం.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!